కాన్సెప్ట్ ఒకరిది..క్రెడిట్ రాజమౌళికా?
బ్రిటన్ కి చెందిన బార్ట్లీ బోగ్లే హెగర్టీ అనే ప్రఖ్యాత కంపెనీకి చెందింది. వాళ్లే స్వయంగా కాన్సెప్ట్ రూపొందించారు.
By: Tupaki Desk | 21 July 2023 6:54 AM GMTదర్శకధీరుడు రాజమౌళి వరల్డ్ వైడ్ ఇప్పుడొ సంచలనం. 'బాహుబలి'..'ఆర్ ఆర్ ఆర్' లాంటి సినిమాలు జక్కన్న కు తెచ్చిన అసాధరణామైన గుర్తింపు అందుకు కారణం. రెండు సినిమాలతో ప్రపంచాన్నే చుట్టేసిన గ్రేట్ ఇండియన్ మేకర్ గా నీరాజనాలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడాయన ఏం చేసినా సంచలనంగానే కనిపిస్తోంది. ఎవరు ఏ పనిచేసినా అందులో తన కష్టం ఉన్నా లేకపోయినా రాజమౌళి బొమ్మ కనిపిస్తే చాలా క్రెడిట్ ఆయన సొంతమవుతుంది.
ఆ పని చేసింది నేను కాదని చెప్పినా! అభిమానలు నమ్మే పరిస్థితుల్లో లేరు. తాజాగా ఇటీవలే ఆయన ఓ యాడ్ లో నటించారు. హీరోలంతా ఇలా చేయాలని ఓ మోబైల్ కంపెనీకి సంబంధించిన యాడ్ లో కనిపించారు.
దీంతో ఆయన క్రియేటివిటీ మొత్తం ఆయనదే? అని నెట్టింట ప్రచారం ఠారెత్తిపోతుంది. ఆ యాడ్ కాన్సెప్ట్ జక్కన్నదే? అని పెద్ద ఎత్తున వాదన సాగుతోంది. అయితే వాస్తవానికి ఆ కాన్సెప్ట్ జక్కన్న ది కాదు.
బ్రిటన్ కి చెందిన బార్ట్లీ బోగ్లే హెగర్టీ అనే ప్రఖ్యాత కంపెనీకి చెందింది. వాళ్లే స్వయంగా కాన్సెప్ట్ రూపొందించారు. అందులో జక్కన్న నటించారు అంతే. కానీ ఈ ఐడియా రాజమౌళితే..ఆయన స్వయంగా డైరెక్ట్ చేసి నటించారంటూ ప్రచారం సాగుతోంది.
ఈ యాడ్ చూడటానికి కారణం రాజమౌళి అని...ఆయన లేకపోతే ఆ యాడ్ ఎవరు చూస్తారు? అని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. చూసారా రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ మార్కెట్ లో ఎలా ఉందో. ఆయన కాదు మొర్రో అన్నా జనాలు వినడం లేదు.
రాజమౌళి సినిమాల్లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది కూడా చాలా తక్కువ సందర్భాల్లోనే. ఏదైనా సినిమాలో కీలక పాత్ర పోషిస్తే ఇంకే రేంజ్ లో సన్నివేశం ఉంటుందో ఊహించొచ్చు. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో ఆప్రికన్ అడవుల నేపథ్యంలో ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాని హాలీవుడ్ లో ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తోంది. అదే జరిగి..హిట్ కొడితే రాజమౌళి ఎవరెస్ట్ శిఖరాన్ని తాకినట్లే.