Begin typing your search above and press return to search.

ఈ క్రేజీ కాంబో కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!

రాజమౌళి హెల్ప్ లేకుండానే పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ఆయనతో సినిమా చేయడం అంటూ జరిగితే మాత్రం ఒక మార్క్ సెట్ చేస్తారు.

By:  Tupaki Desk   |   12 Aug 2024 5:38 AM GMT
ఈ క్రేజీ కాంబో కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!
X

రాజమౌళి సినిమా వస్తుంది అంటే పాన్ ఇండియా ఆడియన్స్ మాత్రమే కాదు పాన్ వరల్డ్ మొత్తం ఎదురుచూసేలా చేసుకున్నాడు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ప్రతి సినిమా ఒక దానికి మించి మరొకటి అనేలా ఉంది. RRR తో హాలీవుడ్ మేకర్స్ ని సైతం అదుర్స్ అనిపించేలా చేసిన జక్కన్న ప్రస్తుతం మహేష్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి ఈ కాంబో నెవర్ బిఫోర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు రెడీ అవుతున్నారు.

రాజమౌళి ఇప్పటివరకు మహేష్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్, సునీల్, నాని, నితిన్ ఇలా వీళ్లతోనే సినిమాలు చేశాడు. ఇప్పుడు మహేష్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇక రాజమౌళి తో చేయాల్సిన హీరోలు ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు పవన్ కళ్యాణ్ కాగా మరొకరు అల్లు అర్జున్ మాత్రమే. రాజమౌళి సినిమా అంటే ఎలా లేదన్నా ఒక రెండు, మూడేళ్లు రాసిచ్చేయాలి. పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చేయడం కష్టం.

ఇక అల్లు అర్జున్ తో రాజమౌళి సినిమా కోసం అల్లు ఆర్మీ ఈగర్ గా ఎదురుచూస్తుంది. రాజమౌళి హెల్ప్ లేకుండానే పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ఆయనతో సినిమా చేయడం అంటూ జరిగితే మాత్రం ఒక మార్క్ సెట్ చేస్తారు. సినిమా సినిమాకు తను పడే కష్టంతో ఆడియన్స్ ని మాత్రమే కాదు సినీ ప్రముఖులను కూడా ఆశ్చర్యపరుస్తూ వస్తున్న అల్లు అర్జున్ ఒక్కసారి ఒక్కటంటే ఒక్కసారి రాజమౌళితో సినిమా చేస్తే ఆ తర్వాత బన్నీకి కూడా హాలీవుడ్ రేంజ్ క్రేజ్ వస్తుంది.

అల్లు అర్జున్ రాజమౌళి ఈ పవర్ ప్యాక్డ్ కాంబో కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ప్రియులు కూడా ఒక అద్భుతమైన సినిమా వస్తుందని హోప్స్ పెట్టుకుంటారు. రాజమౌళి తన ప్రతి సినిమాను ఎంత పర్ఫెక్ట్ గా రావాలని అనుకుంటరో అల్లు అర్జున్ కూడా ప్రతి సినిమాకు ఒక రేంజ్ లో సెట్ చేసుకుంటూ వస్తున్నాడు. సో ఈ ఇద్దరి కలయిక నెక్స్ట్ లెవెల్ సినిమా వస్తుందని అంచనా వేస్తున్నారు ఆడియన్స్. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రం డైరెక్షన్ లో సినిమా లాక్ చేసుకున్నారు. ఆ తర్వాత సందీప్ వంగ్ తో సినిమా ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత రాజమౌళితో అల్లు అర్జున్ చేసే అవకాశం ఉంటుందేమో చూడాలి.