ఫ్యాన్స్‌ని ఉస్సురనిపించిన జక్కన్న -మహేష్
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా విజయంతో రామ్ చరణ్-ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్లుగా ఖ్యాతి ఘడించారు.
By: Tupaki Desk | 28 Nov 2023 6:53 AM GMTదర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా విజయంతో రామ్ చరణ్-ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్లుగా ఖ్యాతి ఘడించారు. ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్స్ పురస్కార ట్రోఫీలు తెలుగు రాష్ట్రానికి తరలివచ్చాయి. ఇంతటి ఘనత వహించిన దర్శకుడి నుంచి తదుపరి సినిమా చిత్రీకరణ ఎప్పుడు? అన్నదే ఇప్పుడు సస్పెన్స్. 2022 మార్చిలో ఆర్.ఆర్.ఆర్ విడుదలైంది. అయితే ఈ రిలీజ్ తర్వాత రాజమౌళి తెరకెక్కించే సినిమా ప్రారంభోత్సవం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. మహేష్ తో సినిమాని అధికారికంగా ప్రకటించినా కానీ, లాంచ్ డేట్ పై ఎలాంటి స్పష్ఠతా రాలేదు.
డిసెంబర్ చివరిలో లేదా జనవరిలో ప్రారంభమవుతుందని సోషల్ మీడియాల్లో ప్రచారం సాగుతున్నా దీనిపై చిత్రబృందం ఎలాంటి హిట్ ఇవ్వలేదు. అయితే నిన్నటి సాయంత్రం యానిమల్ హైదరాబాద్ ఈవెంట్లో అయినా మహేష్ కానీ, రాజమౌళి కానీ దీనిపై స్పందిస్తారేమోనని అంతా ఆశగా వేచి చూసారు. యాంకర్ సుమ పదే పదే రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ గురించి వారిని ప్రశ్నించేందుకు ప్రయత్నించినా కానీ ఎవరూ ఎలాంటి క్లారిటీని ఇవ్వలేదు.
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళిని యాంకర్ సుమ మహేష్ మూవీ గురించి ప్రశ్నించారు. ``అది వేరు ఇది వేరు. ఇక్కడ సందర్భం కాదు`` అంటూ జక్కన్న సైలెంట్ గా అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాత వేదికపైకి వచ్చిన మహేష్ కూడా ఇలానే తప్పించుకోగలిగాడు. ``రాజమౌళి గారు ఏమీ చెప్పలేదు. నేను కూడా అదే మెయింటెయిన్ చేస్తాను!`` అంటూ మహేష్ కూడా సుమ అడిగిన ప్రశ్నకు సమాధానం దాట వేసారు. ఈ రెండు సమాధానాలతో మహేష్ -రాజమౌళి అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. తమ ఫేవరెట్లు ఏదో ఒక హింట్ ఇస్తారని ఆశించారు చాలా మంది. కనీసం లాంచ్ డేట్ ఎప్పుడో కూడా చెప్పలేదు.
ఇంతకుముందు బాహుబలి- ఆర్.ఆర్.ఆర్ విషయంలోను ఆరంభం ఇలానే సస్పెన్స్ మెయింటెయిన్ చేసారు. చాలా కాలం తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అధికారికంగా ప్రతిదీ వెల్లడించారు. ఇప్పుడు మహేష్ మూవీపైనా అలా భారీగా అంచనాలు పెంచేసిన తర్వాత అసలు విషయం చెబుతారేమోనని డౌట్లు పుట్టుకొస్తున్నాయ్. వార్తను దాచి ఉంచితేనే క్యూరియాసిటీ.. దానిని ఓపెన్ చేస్తే ఎలాంటి ఆసక్తి ఉండదు.. అన్న చందంగా ఉంది ఈ వ్యవహారం. ఇప్పటికే ఏడాదిన్నర పైగా అభిమానులు వేచి చూసారు. కనీసం ఇప్పుడు అయినా అధికారికంగా మహేష్ - రాజమౌళి సినిమా గురించి సమాచారం అందుతుందేమో చూడాలి.