Begin typing your search above and press return to search.

రాజ‌మౌళితో మ‌హేష్ సినిమా బిగ్ అప్‌డేట్

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో సంచ‌ల‌నంగా మారారు. ఇప్ప‌టికే ఆయ‌న పాన్ ఇండియా డైరెక్ట‌ర్ గా స‌త్తా చాటారు.

By:  Tupaki Desk   |   13 Nov 2023 9:17 AM GMT
రాజ‌మౌళితో మ‌హేష్ సినిమా బిగ్ అప్‌డేట్
X

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో సంచ‌ల‌నంగా మారారు. ఇప్ప‌టికే ఆయ‌న పాన్ ఇండియా డైరెక్ట‌ర్ గా స‌త్తా చాటారు. త‌దుప‌రి పాన్ వ‌ర‌ల్డ్ మార్కెట్ పై క‌న్నేశారు. పాన్ ఇండియా నుంచి పాన్ వ‌రల్డ్ కి త‌న సినిమాల‌ను తీసుకువెళ్లాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. దీనికి సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో క‌లిసి భారీ ప్రణాళిక‌ను ర‌చించారు. ఒక హాలీవుడ్ స్టార్ కి ఏమాత్రం త‌గ్గ‌ని ఛ‌రిష్మా న‌ట ప్ర‌తిభ ఉన్న మ‌హేష్ తో అయితేనే ఈ ప్లాన్ స‌క్సెస‌వుతుంద‌ని రాజ‌మౌళి భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఇప్ప‌టికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్ర‌సాద్ సహా ర‌చ‌యిత‌ల టీమ్ స్క్రీన్ ప్లే దాదాపు పూర్తి చేసింది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుందని స‌మాచారం. ప్రీప్రొడ‌క్ష‌న్ ని ప్రారంభించి న‌టీన‌టుల ఎంపిక‌ల‌ను కూడా పూర్తి చేస్తార‌ని తెలిసింది. అయితే అంత‌కంటే ముందే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక ఆస‌క్తిక‌ర అప్ డేట్ అందింది.

ఈ సినిమాను కూడా రాజ‌మౌళి అండ్ టీమ్ రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తుంద‌ని స‌న్నిహిత వ‌ర్గాలు వెల్ల‌డించిన‌ట్టు తెలుస్తోంది. బాహుబ‌లి సినిమాని ఒకే సినిమాగా తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేసినా, అనూహ్యంగా రెండు భాగాల క‌థ‌గా మ‌లిచారు. ఆ రెండు భాగాలు ఘ‌న‌విజ‌యం సాధించాయి. బాహుబ‌లి ముందు బాహుబ‌లి త‌ర్వాత అనే రేంజులో పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలిచాయి. ఇప్పుడు మ‌హేష్ తో సినిమాని రెండు భాగాలుగా నిర్మించనున్నారు.

ఇది ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ మూవీ అని చాలా కాలంగా క‌థ‌నాలొస్తున్నాయి. అయితే పాపుల‌ర్ ఆంగ్ల నవల ఆధారంగా ఈ సినిమాని నిర్మిస్తున్నార‌ని కూడా తెలుస్తోంది. బాహుబ‌లి- ఆర్.ఆర్.ఆర్ త‌ర‌హాలోనే ఈ సినిమాకి అడ్వాన్స్‌డ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించనున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియాలో మాత్ర‌మే కాదు, పాన్ వ‌ర‌ల్డ్ మార్కెట్లో విడుద‌ల చేయాల‌నేది ప్లాన్. దీనికోసం ప్ర‌ముఖ హాలీవుడ్ స్టూడియోతో కలిసి పనిచేయనున్నార‌ని స‌మాచారం. ప్ర‌ముఖ తెలుగు నిర్మాత‌ కెఎల్ నారాయణ అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించనున్నారు. హాలీవుడ్ నుంచి ప్ర‌ముఖ సాంకేతిక నిపుణులు, ప్రోస్త‌టిక్స్ స్పెష‌లిస్టులు, స్టంట్ మాస్ట‌ర్ల‌ను బ‌రిలో దించుతార‌ని కూడా తెలుస్తోంది.