తుఫాన్ వచ్చే ముందు ఆ సైలెన్స్ అంతే!
ఆ రకంగా మహేష్-రాజమౌళి అండ్ కో పాన్ ఇండియా ప్రాజెక్ట్ పరంగా ముందుకెళ్తున్నారు.
By: Tupaki Desk | 13 April 2024 12:30 PM GMTతుఫాన్ వచ్చేముందు వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. తీరం దాటే సమయంలో ఎంతటి కల్లోల్లాన్ని సృష్టిస్తుందో? కూడా చెప్పాల్సిన పనిలేదు. ప్రకృతి వైపరిత్యం సంభవించినప్పుడు సన్నివేశం అలా ఉంటుందన్న మాట. తాజాగా మహేష్-రాజమౌళి చేతులు కలిపిన నేపథ్యంలోనూ అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. 'గుంటూరు కారం' రిలీజ్ తర్వాత మహేష్..'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ తర్వాత రాజమౌళి అంతే సైలెంట్ గా ఉన్నారు.
సినిమా చేస్తున్నామనే ప్రకటన వచ్చిన నాటి నుంచి మీడియాలో హైప్ తప్ప ఆ ఇద్దరు ఎలాంటి హడావుడికి ఛాన్స్ తీసుకోలేదు. ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి సమయం సమీపిస్తోన్న నేపథ్యంలో మరింత సైలెన్స్ మెయింటెన్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్...రాజమౌళి ఇద్దరు ఫ్యామిలీతో చిల్ అవుతున్నారు. మహేష్ కుటుంబంతో కలిసి స్విట్జర్లాండ్ వెకేషన్ లో ఉన్నారు. రాష్ట్రంలో ఎండలు దంచేస్తోన్న నేపథ్యంలో మహేష్ ఫ్యామిలీ చల్లని దేశంలో ఉంటుందో తెలియదు. అక్కడ నుంచి తామెంత ఎంజాయ్ చేస్తున్నామన్న సంగతి మాత్రం అభిమానులకు సోషల్ మీడియా లో చెప్పేస్తున్నారు.
ఇక రాజమౌళి ఎప్పుడూ లేనిది ఏకంగా డాన్సులు వేయడం...కుర్రాడిలా మారిపోవడం చేస్తున్నారు. ఆయన సతీమణి రమా సైతం అంతే యాక్టివ్ గా అన్నిరకాల ఈవెంట్స్ లో కనిపిస్తున్నారు. ఆ తీరు చూస్తుంటే రెండు ఫ్యామిలీలు ఈ రెండు నెలలు పాటు సినిమా గురించి ఆలోచన కూడా రానివ్వకూడదని ఫిక్సైనట్లు కనిపిస్తుంది. రాజమౌళి సినిమాకి సంబంధించిన టీమ్ తో కూడా చాలా తక్కువ సమయంలోనే అందుబాటులో ఉంటున్నట్లు సమాచారం.
ఆ రకంగా మహేష్-రాజమౌళి అండ్ కో పాన్ ఇండియా ప్రాజెక్ట్ పరంగా ముందుకెళ్తున్నారు. ఇక సెట్స్ కి వెళ్లిన తర్వాత ఎలా ఉంటుంది? అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు సినిమా పూర్తయ్యే వరకూ బాండ్ అయిపోతారు. మరో ఆలోచన లేకుండా పనిచేస్తారు. అంతటి కమిట్ మెంట్ ఉన్న వారు. ఇక రిలీజ్ తర్వాత విధ్వంసం ఎలా ఉంటుంది? అన్నది ఊహకే వదిలేయాలి. 'బాహుబలి'..'ఆర్ ఆర్ ఆర్' తర్వాత పాన్ ఇండియా లో హ్యాట్రిక్ నమోదు చేసే చిత్రంగా నిలుస్తుందని భావించొచ్చు.