Begin typing your search above and press return to search.

అతన్ని కొడితే.. రాజమౌళి 10 వేల ఆఫర్

టాలీవుడ్ దర్శకుల మధ్య ఒక సహృద్భావ వాతావరణం ఉంటుంది. రెగ్యులర్ గా అందరూ మీట్ అవుతూ ఉంటారు

By:  Tupaki Desk   |   2 May 2024 4:26 AM GMT
అతన్ని కొడితే.. రాజమౌళి 10 వేల ఆఫర్
X

టాలీవుడ్ దర్శకుల మధ్య ఒక సహృద్భావ వాతావరణం ఉంటుంది. రెగ్యులర్ గా అందరూ మీట్ అవుతూ ఉంటారు. అలాగే ఒకరి సినిమాలని ఇంకొకరు ప్రమోట్ చేసుకోవడం జరుగుతుంది. కాంపిటేషన్ ఉన్న కూడా ఫ్రెండ్లీ నేచర్ అందరి మధ్య ఉంటుంది. సినిమా ఈవెంట్స్ లో కలిస్తే ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటారు. ఈ సంభాషణలు ఆసక్తికరంగా మారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుడుగా దూసుకుపోతున్న వ్యక్తి అనిల్ రావిపూడి. కమర్షియల్ చిత్రాలతో వరుస హిట్స్ ని అనిల్ రావిపూడి తన ఖాతాలో వేసుకున్నాడు. అతను సినిమాలు ఎంత ఎంటర్టైనింగ్ గా ఉంటాయో అతను కూడా అలాగే ఉంటాడు. ఎక్కడ స్టేజ్ మీద కనిపించిన హై ఎనర్జీతో మాట్లాడుతూ పాజిటివ్ మూడ్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అందుకే దర్శకుడైన అనిల్ రావిపూడి కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.

అలాగే టాలీవుడ్ మరో మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుడు, ఆస్కార్ ను టచ్ చేసేలా చేసిన డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. రాజమౌళి కూడా ఇతర దర్శకులు తెరకెక్కించిన సినిమా ఈవెంట్స్ కి వచ్చి మాటసాయం చేస్తూ ఉంటాడు. అయితే రాజమౌళి సినిమా ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు పూర్తవుతుందని విషయాలు ఎవరికి ఒక పట్టాన అర్థం కావు. తాజాగా వీరిద్దరూ కృష్ణమ్మ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.

ఇదే ఈవెంట్ కి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజమౌళి గారు చేయబోతున్న మూవీ ఓపెనింగ్ డే ఎప్పుడు?, ఆ మూవీ ఏ జోనర్ ఏంటో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అని అనిల్ రావిపూడి స్టేజ్ పై మాట్లాడారు. కొరటాల శివ చేస్తోన్న దేవర మూవీ రిలీజ్ డేట్ కూడా చెబితే బాగుంటుందని అన్నాడు.

దీనికి కౌంటర్ గా రాజమౌళి మాట్లాడుతూ ఎవరైనా వెనక నుంచి కెమెరా పట్టుకుని వెళ్లి అనిల్ రావిపూడి మీద ముసుగేసి కొడితే 10 వేలు ఇస్తా అంటూ సరదాగా ఆఫర్ చేశారు. మరి మీరు అంత ఎక్కువ ఆఫర్ చేస్తే ఎవరైనా కొట్టేసే ఛాన్స్ ఉంది సర్, కాస్తా రేటు తగ్గించండి అంటూ అనిల్ రావిపూడి రాజమౌళి వ్యాఖ్యలపై కౌంటర్ గా రియాక్ట్ కావడం విశేషం. వీరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజమౌళి సినిమా ఓపెనింగ్ ఎప్పుడు అనేది కేవలం అతను మాత్రమే చెప్పగలరు అంటూ నెటిజన్స్ ఈ వీడియో పై ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.