Begin typing your search above and press return to search.

రాజమౌళి అంతే మొత్తం మార్చేస్తాడు..!

ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే వరకు డైరెక్టర్ పడే తపన ఏంటన్నది అందరికీ తెలిసిందే

By:  Tupaki Desk   |   10 July 2024 10:12 AM GMT
రాజమౌళి అంతే మొత్తం మార్చేస్తాడు..!
X

ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే వరకు డైరెక్టర్ పడే తపన ఏంటన్నది అందరికీ తెలిసిందే. అందుకే వరుస హిట్లతో సెన్సేషన్ సృష్టిస్తున్న రాజమౌళి లాంటి డైరెక్టర్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి సినిమా అంటే ఆయన చివర్లో వేసే రాజ ముద్ర లానే సూపర్ హిట్ పక్కా అనే ఆడియన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. ఐతే ఆ మార్క్ సెట్ చేయడం కోసం ఆయన చేసే కృషి అంతా ఇంతా కాదు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా రూపురేఖలు మార్చేసిన దర్శకుడు రాజమౌళి.

జూలై 10 2015 సరిగ్గా 9 ఏళ్ల క్రితం బాహుబలి మొదటి భాగం రిలీజైంది. ఈ సినిమా తెలుగు సినిమా తల రాతను మార్చేసింది. ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసింది. ఒక కథను రెండు ముక్కలుగా చెప్పొచ్చు అనే విషయాన్ని చెప్పింది. ఒక్కటేంటి రాజమౌళి బాహుబలి తీశాడు మనం ఎందుకు తీయలేం అని ప్రతి దర్శకుడు తాను కన్న కలని నిజం చేసుకునేందుకు నడుం బిగించి ముందుకు నడిచే స్పూర్తిని ఇచ్చాడు.

9 ఏళ్ల బాహుబలి బిగినింగ్ సినిమా గురించి ఇప్పటివరకు ఆడియన్స్ కు తెలియని ఒక విషయం బయటకు వచ్చింది. అదేంటి అంటే బాహుబలి 1 ఇంటర్వల్ లో విగ్రహం పైకెత్తుతూ అక్కడ ప్రజలు బాహుబలిని చూస్తారు. అందరు బాహుబలి బాహుబలి అంటూ హుశారెత్తించేలా చెబుతారు. అదే బాహుబలి 1 ఇంటర్వెల్ అవుతుంది. ఐతే రాజమౌళి ముందు అలా కాకుండా దేవసేన డైలాగ్ తో మాహిష్మతి ఊపిరి పీల్చుకో.. నా కొడుకు వచ్చాడు.. బాహుబలి తిరిగి వచ్చాడు అనే సీన్ తో శివుడు పంచభూతాలు అంటే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం దాటుకుంటూ వస్తాడు దీన్ని ఇంటర్వెల్ గా చేద్దామని అనుకున్నారట.

ఇదే కాదు శివుడు మాహిష్మతికి వచ్చే టైంలో సైనికులతో ఫైట్ చేస్తాడు అక్కడ ఒకతను బాహుబలిని గుర్తు పట్టి వచ్చి బిజ్జలదేవాకి చెబుతాడు. అప్పుడు బిజ్జలదేవా వాడి ప్రాణాలు పంచభూతాల సాక్షిగా మట్టిలో కలిపేశాం అని చెప్పగా ఒక్కొక్కటి దాటుకుంటూ శివుడు వస్తాడు. ఈ సీన్ కి ఆల్రెడీ షూట్ జరగగా బిజ్జల దేవా డైలాగ్స్ అన్ని కట్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి అలా బాహుబలి 1 ఇంటర్వల్ కోసం రాజమౌళి అలా ప్లాన్ చేశారు.

ఇక పార్ట్ 1 మీద ఉన్న అంచనాలను ఏమాత్రం తగ్గకుండా బాహుబలి 2 వచ్చింది. ఆ సినిమా కూడా నెవర్ బిఫోర్ రికార్డులను కొల్లగొట్టింది. బాహుబలి 1, 2 సినిమాలు సృష్టించిన రికార్డులు ఇప్పటివరకు ఏ సినిమా బ్రేక్ చేయలేదు.