ప్రభాస్ ట్విస్ట్.. జక్కన్న ముందే చెప్పాడు
ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ‘కల్కి 2898 AD’ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైంది.
By: Tupaki Desk | 27 Jun 2024 10:40 AM GMTప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ‘కల్కి 2898 AD’ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైంది. ఈ సినిమాకు ఇప్పటికే పాజిటివ్ టాక్ రావడంతో, ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ బడ్జెట్‌తో, స్టార్ కాస్ట్‌తో, మరియు శక్తివంతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక మహాభారతాన్ని ఆధారంగా తీసుకున్న ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా అందరిలో ఆసక్తిని పెంచుతోంది.
ఈ సినిమాలో ప్రభాస్ ద్విభిన్న పాత్రల్లో కనిపించడంతో, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. మొదటి పాత్రలో బౌంటీ హంటర్‌గా నటిస్తూ, తన కామెడీ టైమింగ్ మరియు యాక్షన్ సీక్వెన్స్‌లతో ఆద్యంతం ఆకట్టుకుంటాడు. కానీ క్లైమాక్స్‌లో మహాభారతంలోని ఒక కీలక పాత్రలో ప్రత్యక్షమవడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఈ ట్విస్ట్‌కి సంబంధించిన ఎలివేషన్స్ థియేటర్లలో సందడి పుట్టిస్తున్నాయి.
మహాభారతంలో ఆ పాత్రను ప్రభాస్‌కు ఇస్తానని రాజమౌళి ఒక ఈవెంట్‌లో చెబుతూ, అతని ఆలోచనలో ఉన్న పాత్రను వెల్లడించాడు. ఇప్పుడు, అదే పాత్రను నాగ్ అశ్విన్ తన సినిమాలో చూపించడం ప్రభాస్ అభిమానులను మరింత ఉత్సాహపరచింది. రాజమౌళి గతంలో చెప్పిన వీడియోను చూసి, ఆయన చెప్పిన పాత్రను ఇప్పుడు కల్కిలో చూస్తున్నారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఆ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దీపికా పదుకొనే సుమైటీ పాత్రలో నన్ను ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆమె పాత్రలోని భావోద్వేగాలు మరియు సానుభూతి ప్రేక్షకుల హృదయాలను టచ్ చేస్తున్నాయి. అలాగే స్టార్ నటుడు కమల్ హాసన్ విలన్ పాత్రలో కనిపిస్తూ, తన నటనతో అందరినీ ఆశ్చర్యపరచారు. అమితాబ్ బచ్చన్ కూడా తన ప్రత్యేకతను ఇక్కడ చూపించాడు.
ఈ సినిమాలోని ఇతర ముఖ్య పాత్రలలో మలయాళ హీరోయిన్ మాళవిక నాయర్ మరియు అన్నా బెన్ తమ నటనతో ఆకట్టుకున్నారు. ఫరియా అబ్దుల్లా మరియు శోభన వంటి నటీమణులు చిన్న పాత్రల్లో మెరిసి, తమ ప్రత్యేకతను చూపించారు. మొత్తంగా ‘కల్కి 2898 AD’ సినిమా అన్ని అంశాలలో ప్రేక్షకుల అంచనాలను అందుకుంది.
భారీ బడ్జెట్, గొప్ప నటీనటుల ప్రదర్శనలు, మరియు అద్భుతమైన విజువల్స్ ఈ సినిమాను మరింత గ్రాండ్‌గా మార్చాయి. కథలో ఉన్న ట్విస్ట్‌లు, మహాభారతంలోని పాత్రలతో కలిపి, సినిమా ఒక ప్రత్యేక అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తోంది. ఇది ‘కల్కి 2898 AD’ సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం పక్కా అని చెప్పవచ్చు