రాజమౌళి 'గోల్డ్'.. టార్గెట్ 'బాహుబలి 2'
అంతేకాదు ఈ సినిమాకి "గోల్డ్'' (GOLD) అనే టైటిల్ ను రాజమౌళి పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 25 July 2024 10:03 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబోలో ఓ గ్లోబ్ ట్రాటింగ్ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించి ఏ చిన్న వార్త వినిపించినా క్షణాల్లో వైరల్ చేసేస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మహేశ్ తో ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ యాక్షన్ మూవీ తీయనున్నట్లు క్లారిటీ వచ్చేసింది. రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవలే స్క్రిప్ట్ లాక్ చేసినట్లుగా టాక్. అంతేకాదు ఈ సినిమాకి "గోల్డ్'' (GOLD) అనే టైటిల్ ను రాజమౌళి పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకముందు 'మహారాజా' 'చక్రవర్తి' వంటి టైటిల్స్ కూడా ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదని బళ్లారిలో రాజమౌళి చెప్పడంతో వాటికి ఫుల్ స్టాప్ పడింది. ఇప్పుడు 'గోల్డ్' అనే మరో పేరు తెర మీదకు వచ్చింది.
ఇదిలా ఉంటే SSMB29 స్టార్ట్ అవ్వకముందే ఈ సినిమా బాక్సాఫీస్ లెక్కల గురించి చర్చలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కాలంలో ఇండియన్ సినిమాకి 1000 కోట్ల క్లబ్ అనేది మినిమం బెంచ్ మార్క్ గా మారిన నేపథ్యంలో.. మహేష్ బాబు మూవీ భారీ వసూళ్లను రాబట్టడం గ్యారంటీ అని అభిమానులు అంచనాలు వేస్తున్నారు. ఇది కచ్ఛితంగా రాజమౌళి గత రికార్డులను బ్రేక్ చెయ్యాల్సిన అవసరముందని కామెంట్స్ చేస్తున్నారు.
రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి 2' సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹1810 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇది 1000 కోట్ల క్లబ్ లో చేరిన తొలి భారతీయ చిత్రంగా.. దేశీయ మార్కెట్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా చరిత్రకెక్కింది. ఆ తర్వాత జక్కన్న కూడా మళ్ళీ తన రికార్డును తాను బ్రేక్ చేయలేకపోయారు. RRR మూవీ వరల్డ్ వైడ్ గా ₹1387+కోట్లు రాబట్టింది. దీంతో పాటుగా దంగల్, KGF-2, జవాన్, పఠాన్, కల్కి 2898 AD సినిమాలు సైతం వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాయి. దీంతో ఇప్పుడు రాజమౌళి టార్గెట్ అంతకు మించి ఉండాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
'ఆర్.ఆర్.ఆర్' మూవీతో ఆస్కార్ అవార్డు సాధించినప్పటికీ.. 'బహుబలి 2: ది కన్క్లూజన్' రికార్డులు బ్రేక్ చేయలేకపోయారు రాజమౌళి. అందులోనూ గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన తర్వాత, ఇప్పుడు దర్శకుడి మార్కెట్ పెరిగిపోయింది. మిగతా దర్శకుల మాదిరిగా జక్కన్న ఇప్పుడు వెయ్యి కోట్ల క్లబ్ లో చేరితే సరిపోదు. 1500 కోట్లకు పైగా వసూళ్లతో RRR ను దాటడమే కాదు, 1800+ కోట్లు కొల్లగొట్టి 'బాహుబలి 2' రికార్డ్ ను బ్రేక్ చేసి చూపించాల్సిన అవసరముంది.
SSMB 29 చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. దీన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకెళ్లడానికి రాజమౌళి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హలీవుడ్ టెక్నీషియన్స్ తో విజువల్ ఎఫెక్ట్స్ చేయించే ప్లాన్ లో ఉన్నారు. ఇది కచ్చితంగా మన ఇమేజినేషన్ కి అందనిస్థాయిలో ఉంటుందని, అన్ని సినిమాలకి బాప్ లా ఉండబోతోందని రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు అన్నారు. మహేశ్ బాబు మూవీపై అంచనాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే, ఈసారి 'బాహుబలి 2' రికార్డ్స్ అందుకునే అవకాశం ఉందనిపిస్తుంది.
అందులోనూ రాజమౌళి లాంటి మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లర్ కు అసాధ్యం కానిదంటూ ఏమీ లేదు. సినిమాకి మార్కెటింగ్ చేయడంలో, దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో ఆయన్ని కొట్టేవారే లేరు. మహేశ్ బాబు మూవీ కోసం ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లుగా టాక్ ఉంది. కాబట్టి 'బాహుబలి 2' ను టార్గెట్ గా పెట్టుకొని ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.