Begin typing your search above and press return to search.

జ‌పాన్ టెక్నీషియ‌న్ల‌తో గంట‌ల కొద్దీ రాజ‌మౌళి

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇటీవల తన బ్లాక్ బస్టర్ చిత్రం `ఆర్ఆర్ఆర్` ప్రత్యేక స్క్రీనింగ్ ఈవెంట్ కోసం జపాన్ వెళ్లారు.

By:  Tupaki Desk   |   22 March 2024 3:44 AM GMT
జ‌పాన్ టెక్నీషియ‌న్ల‌తో గంట‌ల కొద్దీ రాజ‌మౌళి
X

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇటీవల తన బ్లాక్ బస్టర్ చిత్రం `ఆర్ఆర్ఆర్` ప్రత్యేక స్క్రీనింగ్ ఈవెంట్ కోసం జపాన్ వెళ్లారు. తన పర్యటనలో జ‌ప‌నీ సాంకేతిక నిపుణులు రుయి కురోకి-సాన్ అండ్ కజుటో నకాజవా-సాన్‌లను కలుసుకున్నాడు. అంతేకాదు ఆ ముగ్గురితో గంట‌ల కొద్దీ స‌మ‌యం గ‌డిపాడు. వారితో చాలా విష‌యాల‌ను చ‌ర్చించారు. ఇదంతా దేనికోసం? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

జ‌క్క‌న్న ప్ర‌స్తుతం మ‌హేష్ తో ఫారెస్ట్ అడ్వంచ‌ర్ మూవీని తెర‌కెక్కించేందుకు ప్ర‌తిదీ సిద్ధం చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ భారీ బ‌డ్జెట్ సినిమా లో కొన్ని అరుదైన‌ కొత్త విద్య‌ల‌ను కూడా ప‌రిచ‌యం చేసే ఆలోచ‌న ఉంది. ఇక‌పోతే జ‌పాన్ లో పాపుల‌ర్ `అనిమే` ప్రపంచాన్ని రాజ‌మౌళి అన్వేషించేందుకే ఆ ముగ్గురిని క‌లిసాడు. అనిమేపై తనకున్న ఆసక్తిని తెలియజేస్తూ రాజమౌళి చేసిన ట్వీట్ అతడి సినిమా కోసమే ఇదంతా అని అర్థ‌మ‌వుతోంది.

``అద్భుతమైన జపనీస్ యానిమే ప్రక్రియ .. తయారీ గురించి నేను ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉంటాను... ధన్యవాదాలు.. రుయి కురోకి-సాన్ .. కజుటో నకాజవా-సాన్ ల‌తో అద్భుతమైన సమయం గ‌డిపాను. మా సృజనాత్మక చర్చలను పూర్తిగా ఆస్వాధించాము. త‌దుప‌రి చిత్రం కోసం ఎదురు చూస్తున్నాను`` అని తెలిపాడు.

రాజమౌళి జపనీస్ అనిమే ప్రపంచాన్ని తెలుసుకుని అబ్బుర‌ప‌డ్డాడు. సృష్టి ప్రక్రియ గురించి తన ఎగ్జ‌యిట్ మెంట్ ని వ్యక్తం చేశాడు. X లో రాజ‌మౌళి స్వ‌యంగా ఫోటోల‌ను షేర్ చేసారు. జ్ఞానోదయం కలిగించే చర్చల కోసం రుయి కురోకి-సాన్ మరియు కజుటో నకాజవా-సాన్‌లకు కృతజ్ఞతలు... అని రాసాడు. వారితో స్నేహాన్ని ప్రతిబింబిస్తూ చ‌క్క‌ని ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసారు.

మ‌హేష్‌తో రాజ‌మౌళి చిత్రం `జంగిల్ అడ్వెంచర్` క‌థాంశంతో తెర‌కెక్కుతోంది. ఈ చిత్రం గురించిన తారాగణం సిబ్బంది వంటి ఇతర వివరాలు ఇంకా వెల్ల‌డి కావాల్సి ఉంది. ఈ సినిమా 1000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెర‌కెక్క‌నుంద‌ని రాజ‌మౌళి, మ‌హేష్ కెరీర్ లోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌లలో ఈ చిత్రం ఒకటిగా నిలుస్తుంద‌ని చెబుతున్నారు. SS రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రం స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని త్వ‌ర‌లో చిత్రీక‌ర‌ణ‌కు వెళ‌తామ‌ని వెల్ల‌డించారు.