'బాహుబలి' న్యూ వరల్డ్ లోకి అతి త్వరలోనే!
తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం `బాహుబలి`. భారతీయ చిత్రాలు కూడా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోవని నిరూపించిన చిత్రమది.
By: Tupaki Desk | 1 May 2024 5:01 AM GMTతెలుగు సినిమా సత్తా ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం `బాహుబలి`. భారతీయ చిత్రాలు కూడా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోవని నిరూపించిన చిత్రమది. `బాహుబలి` రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద 2000 కోట్ల కు పైగా వసూళ్లను సాధించింది అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ చిత్రంగా భారత్ లో నిలిచింది. వరల్డ్ వైడ్ గా ఆ సినిమా క్రేజ్ చూసి రచయిత ఆనంద్ నీలకంఠ `ది రైజ్ ఆఫ్ శివగామి` అనే పుస్తకాన్ని వ్రాసారు. దీని ఆధారంగానే `బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్` పేరుతో లైవ్-యాక్షన్ వెబ్ సిరీస్‌గా రూపొందించారు.
కొన్ని ఎపిసోడ్‌లను చిత్రీకరించిన అనంతరం నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిలిపివేసింది. అందుకు గల కారణాలు ఏంటి అన్నది తెలియదు గానీ తాజాగా మరో `బాహుబలి` రావడానికి రెడీ అవుతోంది. లైవ్-యాక్షన్ సిరీస్ కంటే బెటర్ గా బాహుబలి మేకర్స్ `బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్` అనే యానిమేటెడ్ వెబ్ సిరీస్‌తో వస్తున్నారు. డిస్నీ+హాట్‌స్టార్ లో ఇది ప్రసారం కానుంది. ఆ బాధ్యతలు కూడా ఎస్ ఎస్ రాజమౌళినే తీసుకున్నారు. యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
`అతడి పేరును మాహిష్మతి ప్రజలు జపిస్తుంటే.. తిరిగి రాకుండా ప్రపంచంలో అతడిని ఏ శక్తి అడ్డుకోలేదు. యానిమేటెడ్ సిరీస్ బాహుబలి ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ త్వరలో రానుంది` అంటూ ప్రకటించారు జక్కన్న. అంతకు మించి ఎలాంటి వివరాలు షూర్ చేయలేదు. ట్రైలర్ రిలీజ్ అయ్యాక మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశా లున్నాయి. అయితే ఈ యానిమేటేడ్ సిరీస్ ను ఓటీటీతో పాటు ముందుగా థియేటర్లో రిలీజ్ చేస్తారా? అన్నది చూడాలి. ఎందుకంటే సినిమాల్నే రీ-రిలీజ్ చేస్తున్నారు.
కాబట్టి `బాహుబలి` లాంటి గొప్పచిత్రం యానిమేటెడ్ వెర్షన్ ఐమాక్స్ లాంటి పెద్ద థియేటర్లలో ప్రీవ్యూల రూపంలో వేస్తే! రెండు రోజులు షోలు వేసినా మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. మంచి ఆదాయానికి అవకాశం ఉంది. సాధారణంగా ఇలాంటి విషయాల్లో జక్కన్న గొప్ప బిజినెస్ స్ట్రాటజీని అనుసరిస్తారు. మరిఇప్పుడా ఛాన్స్ తీసుకుంటారా? లేక కేవలం డిజిటల్ స్ట్రీమింగ్ కే పరిమితం చేస్తారా? అన్నది చూడాలి. `బాహుబలి` అభిమానులైతే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో మే 2వ వారం నుండి ఈ సిరీస్‌ను ప్రదర్శించనున్నట్లు ప్రచారం సాగుతుంది.