Begin typing your search above and press return to search.

ఎన్ని వచ్చినా.. జక్కన్నదే హైలైట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Aug 2024 12:30 PM GMT
ఎన్ని వచ్చినా.. జక్కన్నదే హైలైట్
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అనౌన్స్మెంట్ తర్వాత మహేష్, జక్కన్న మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. రీసెంట్ గా మహేష్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఏమైనా అప్డేట్ ఇస్తారోమోనని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేశారు. కానీ వారికి నిరాశే మిగిలింది.

ప్రస్తుతం మేకర్స్.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పై కంప్లీట్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ టీపీ విజయన్ తన ఇన్ స్టాలో గోల్డ్ కలర్ లో ఉన్న గద్ద రెక్కలను పోస్ట్ చేశారు. SSMB29,SSMB29 DIARIES అని రాసుకొచ్చారు. దీంతో మహేష్, రాజమౌళి మూవీకి గరుడ అనే టైటిల్ పెట్టనున్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. థ్రిల్లింగ్ జంగిల్ అడ్వెంచర్‌ జోనర్ లో మూవీ ఉంటుందని అంచనాలు ఉన్నాయి.

అయితే అలాంటి జోనర్ లోనే బాలీవుడ్ లో కూడా ఓ మూవీ రూపొందుతోంది. దేశంలోని అడవులు, ఎత్తైన పర్వతాలు, గుహలను అన్వేషించే వ్యక్తి చుట్టూ తిరిగే ఆ సినిమాలో స్టార్ హీరో అజయ్ దేవగన్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. జగన్ శక్తి దర్శకత్వం వహిస్తున్నారు. హై క్వాలిటీ విజువల్స్, అదిరిపోయే ఎఫెక్ట్స్ తో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి, మహేష్ కాంబోలో రానున్న సినిమాకు ముందే ఆ మూవీ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

దీంతో కావాలనే బాలీవుడ్ మేకర్స్ అలా చేస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒక బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా వస్తే.. మళ్లీ అదే బ్యాక్ డ్రాప్ తో మరో మూవీ అంటే సినీ ప్రియులు ఇంట్రెస్ట్ చూపించరని అంటున్నారు. కానీ రాజమౌళి విషయంలో అలాంటి డౌట్స్ అక్కర్లేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఆయన ట్రాక్ రికార్డును గుర్తు చేసుకుంటే చాలు అంటున్నారు. బాలీవుడ్ అనే కాదు.. ఏ సినీ ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు వచ్చినా.. రాజమౌళి టాలెంట్ ను బీట్ చేయలేవని చెబుతున్నారు.

జక్కన్న స్టోరీ టెల్లింగ్ అలా ఉంటుందని పొగుడుతున్నారు. సింపుల్ పాయింట్ ను తీసుకుని దాన్ని అద్భుతమైన కథగా మరల్చడంలో రాజమౌళి సిద్ధహస్తులుగా కొనియాడుతున్నారు. ఆయన తీసిన సినిమాలు ఎలాంటి హిట్ అయ్యోయో అందరికీ తెలుసు అని అంటున్నారు. ఎలాంటి పోటీ ఉన్నా.. జక్కన్న చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయని గుర్తు చేస్తున్నారు. కాబట్టి వంద చిత్రాలను అదే జోనర్ లో రిలీజ్ చేసినా... రాజమౌళి వర్క్ కు తిరుగులేదని చెబుతున్నారు.