Begin typing your search above and press return to search.

కల్కి ఎఫెక్ట్.. రాజమౌళి ఏం చేయాలి..?

లేటెస్ట్ గా వచ్చిన కల్కి చూశాక డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపంలో రాజమౌళికి గట్టి పోటీ వచ్చేలా ఉందని అర్ధమవుతుంది.

By:  Tupaki Desk   |   28 Jun 2024 5:20 AM GMT
కల్కి ఎఫెక్ట్.. రాజమౌళి ఏం చేయాలి..?
X

బాహూబలి సినిమాతో తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేలా చేశాడు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలితో మొదలు పెట్టి RRR తో ఏకంగా ఒక ఆస్కార్ నే తీసుకొచ్చాడు. బాహుబలి, RRR లాంటి భారీ స్కేల్ లో సినిమాలు చేయాలంటే అది తన వల్లే సాధ్యమవుతుందని ప్రూవ్ చేశాడు. కానీ అతని స్పూర్తితో మరికొంతమంది అలాంటి ప్రయత్నాలు చేయడానికి దారి చూపాడు. లేటెస్ట్ గా వచ్చిన కల్కి చూశాక డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపంలో రాజమౌళికి గట్టి పోటీ వచ్చేలా ఉందని అర్ధమవుతుంది.

నిన్నమొన్నటి దాకా భారీ బడ్జెట్ తో పెద్ద స్కేల్ లో సినిమాలు తీయాలంటే అది కేవలం రాజమౌళి వల్లే అవుతుందని అనుకున్నారు. కానీ కల్కి చూశాక మనకు మరో రాజమౌళి ఉన్నాడని ప్రూవ్ అయ్యింది. నాగ్ అశ్విన్ రూపంలో రాజమౌళికి ఒక పెద్ద ఛాలెంజ్ ఎదురవుతుంది. కల్కి తర్వాత కచ్చితంగా పరిస్థితులు మారే అవకాశం ఉంది. అంతేకాదు కల్కి ఎఫెక్ట్ రాజమౌళి చేయబోతున్న మహేష్ సినిమాపై కూడా ఉంటుంది.

ఇప్పటివరకు రాజమౌళి సినిమాలతోనే ఒక గొప్ప గ్రాండియర్ ఎక్స్ పీరియన్స్ చూసిన తెలుగు ఆడియన్స్ ఇక మీదట నాగ్ అశ్విన్ సినిమాలను కూడా పట్టించుకునేలా చేశాడు. ఇలాంటి టైం లో నాగ్ అశ్విన్ ని దాటేలా రాజమౌళి సినిమా చేయాల్సి ఉంటుంది. ఇద్దరు తెలుగు దర్శకులే ఇద్దరి మధ్య పోటీ ఏంటని అనుకోవచ్చు. ఇది పోటీ కాదు ఎవరికి వారికి వాళ్ల మీద ఉన్న నమ్మకం. కచ్చితంగా రాజమౌళి మహేష్ సినిమాను నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వెళ్లాల్సి ఉంటుంది.

ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ కాగా కల్కి చూశాక రాజమౌళి తన సినిమా గురించి మరింత కేర్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కల్కి ఎఫెక్ట్ కచ్చితంగా రాజమౌళి సినిమాపై ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కల్కి సినిమా ఫస్ట్ పార్ట్ తోనే ఈ రేంజ్ సంచలనం సృష్టించిన నాగ్ అశ్విన్ ఇక సెకండ్ పార్ట్ ని ఎలా తీస్తాడో అని ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఏది ఏమైనా అటు రాజమౌళి ఇటు నాగ్ అశ్విన్ ఇద్దరు తెలుగు సినిమాను హాలీవుడ్ సినిమాల సరసన చేర్చేందుకు కృషి చేస్తున్నారు. మహేష్ 29వ సినిమాగా రాజమౌళి చేస్తున్న మూవీ ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది. ఈ సినిమాను కూడా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి.