Begin typing your search above and press return to search.

రాజమౌళి - మహేష్.. సమయం ఆసన్నమైంది

ఇక మొత్తానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ఫినిష్ అయితే చేశాడు.

By:  Tupaki Desk   |   28 Dec 2023 3:01 PM GMT
రాజమౌళి - మహేష్.. సమయం ఆసన్నమైంది
X

సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా తర్వాత ఎవరితో వర్క్ చేయబోతున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ ప్రాజెక్టుపై ఇప్పటికే అంచనాల స్థాయి ఆకాశాన్ని దాటేసింది. మహేష్ గుంటూరు కారం ఎప్పుడు ఫినిష్ చేస్తాడా? రాజమౌళితో ఎప్పుడు జత కడతాడా అని చాలామంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక మొత్తానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ఫినిష్ అయితే చేశాడు.


అసలైతే నిన్ననే మొత్తం షూటింగ్ పూర్తి కావాల్సింది. కానీ ఈరోజు మళ్లీ కొన్ని చిన్న తరహా సీన్స్ రీ షూట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే ఈ ప్రాజెక్టు పూర్తయింది. ఇక నెక్స్ట్ మహేష్ బాబు పూర్తిస్థాయిలో రాజమౌళి సినిమాతో బిజీ కాబోతున్నాడు. రాజమౌళి మొన్నటి వరకు స్క్రిప్ట్ కు సంబంధించిన పనుల్లో చాలా బిజీగా కనిపించాడు. దాదాపు ఆ పనులు ఫినిష్ అయినట్లుగా తెలుస్తోంది.

ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయడానికి కూడా ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మహేష్ బాబు సినిమాను రాజమౌళి ఫ్యాన్ వరల్డ్ తరహాలో తెరపైకి తీసుకు రాబోతున్నాడు అని ఇదివరకే కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలియజేశారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ ఫిలింగా ఉంటుంది అని కూడా ఆయన ఒక చిన్న హింట్ అయితే ఇచ్చారు.

ఇక సినిమా షూటింగ్ అయితే 2024 సమ్మర్లో లేదా ఆ తర్వాత మొదలయ్యే అవకాశం ఉంది. కానీ ఈ లోపు మహేష్ బాబు రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడపబోతున్నారు ఫిట్నెస్ విషయంలో కూడా మహేష్ కొంత మార్పులు చేసే అవకాశం ఉంది. అలాగే యాక్షన్ సన్నివేశాల కోసం వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారు. ప్రతి సినిమాకు కూడా వర్క్ షాప్ అయితే ఉంటుంది.

నటీనటులు టెక్నీషియన్స్ అందరూ కూడా ప్రత్యేకంగా రాజమౌళి నిర్వహించే క్లాస్ లకు లో హాజరు కావాల్సిందే. ఇక ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం ఆ ప్రక్రియకు ఆసన్నం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. టెక్నీషియన్స్ విషయంలో కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన రాజమౌళి పూర్తి టీమ్ ను ఫిక్స్ చేసుకుని ప్రాజెక్టు పనులను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.

ఇక ఇక సినిమా షూటింగ్ మొదట హైదరాబాదులోని ఒక భారీ సెట్ ద్వారా మొదలుపెట్టబోతున్నారు. ఆ తర్వాత ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా కొన్ని రియల్ లొకేషన్స్ లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించే అవకాశం ఉంది. ఇక ప్రాజెక్టును పూర్తిచేసేసరికి ఏడాది కంటే ఎక్కువ సమయమే పడుతుంది. మరి రాజమౌళి మహేష్ ప్రాజెక్టును ఎంత టైం లో ఫినిష్ చేస్తాడో చూడాలి.