రాజమౌళి నటించిన సినిమా అడ్రస్ లేకుండా పోయింది
ఇదిలా ఉంటే జక్కన్న చైల్డ్ యాక్టర్ గా ఒక సినిమాలో చేసాడనే విషయం చాలా మందికి తెలియదు. నిజానికి ఆ మూవీ రిలీజ్ కూడా కాలేదు
By: Tupaki Desk | 15 Dec 2023 4:20 AM GMTఇండియన్ సినిమాని హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్లిన దర్శకుడిగా రాజమౌళికి మంచి గుర్తింపు ఉంది. ఆర్ఆర్ఆర్ తో ఇండియన్ సినిమాకి ఆస్కార్ అవార్డు అందించిన ఘనత సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ రెడీ అవుతోంది.
ఇదిలా ఉంటే జక్కన్న చైల్డ్ యాక్టర్ గా ఒక సినిమాలో చేసాడనే విషయం చాలా మందికి తెలియదు. నిజానికి ఆ మూవీ రిలీజ్ కూడా కాలేదు. అలాగే జక్కన్న కూడా ఎక్కడా చెప్పలేదు. ఈ కారణంగానే రాజమౌళి బాలనటుడిగా చేసిన మూవీ గురించి చర్చించలేదు. ఈ సినిమాని రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ నిర్మించారంట.
జక్కన్న బాబాయ్ శివశక్తి దత్తా దర్శకత్వంలో పిల్లనగ్రోవి టైటిల్ తో ఈ సినిమాని తెరకెక్కించారంట. అయితే షూటింగ్ మేగ్జిమమ్ అయిపోయే సమయానికి బడ్జెట్ లేకపోవడంతో కొంత భాగం పెండింగ్ ఉండిపోయిందంట. దీంతో మూవీని ఆపేశారంట. అలా సినిమాకి పెట్టిన పెట్టుబడి వృథా అయ్యింది. అలాగే సినిమా రిలీజ్ కాకపోవడం వలన బాలనటుడిగా డెబ్యూ కూడా రాజమౌళికి మిస్ అయ్యింది.
ఈ మూవీలో ఎంఎం శ్రీలేఖ కూడా నటించారంటే. ఆమె చేసిన పాత్ర ఏంటనేది తెలియరాలేదు. చైల్డ్ యాక్టర్ గా స్క్రీన్ మీద కనిపించడం మిస్ అయిన కూడా రాజమౌళి అప్పుడప్పుడు తనలోని నటుడిని బయటకి తీసుకొస్తున్నారు. మజ్ను సినిమాలో క్యామియో చేశారు. అలాగే తన దర్శకత్వంలో వచ్చే చాలా సినిమాలలో రాజమౌళి క్యామియో అప్పీరియన్స్ మాత్రం కచ్చితంగా ఉంటుంది.
రాజమౌళి యాక్టింగ్ స్కిల్స్ చూసిన వారు అతన్ని పూర్తిస్థాయిలో నటుడిగా సిల్వర్ స్క్రీన్ పై చూడాలని కోరుకుంటున్నారు. అయితే రాజమౌళి మాత్రం వరుసగా భారీ ప్రాజెక్ట్స్ పెట్టుకొని ఉండటం వలన నటుడిగా కనిపించే ఛాన్స్ అయితే లేదని చెప్పొచ్చు. ఎవరైనా దర్శకుడు మంచి కథ రెడీ చేసుకొని దానికి రాజమౌళి మాత్రమే న్యాయం చేయగలరని అనుకుంటే అప్పుడు ఒప్పుకునే అవకాశం ఉండొచ్చు అని సినీ విశ్లేషకులు అంటున్నారు.