తారక్.. కుంటి గుర్రంతో యుద్ధం
ప్రస్తుతం ఇండియన్ సినిమాని హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్ళిన దర్శకుడిగా రాజమౌళికి అరుదైన గౌరవం ఉంది
By: Tupaki Desk | 4 Jan 2024 4:04 AM GMTప్రస్తుతం ఇండియన్ సినిమాని హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్ళిన దర్శకుడిగా రాజమౌళికి అరుదైన గౌరవం ఉంది. అతని సినిమాల కోసం హాలీవుడ్ లెవల్ లో ఆడియన్స్ తో పాటు సెలబ్రిటీలు ఎదురుచూస్తూ ఉంటారు. రాజమౌళి దర్శకుడిగా మొదటి సినిమా చేసింది జూనియర్ ఎన్టీఆర్ తో అనే సంగతి అందరికి తెలిసిందే. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో రాజమౌళి దర్శకుడుగా అడుగుపెట్టి మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
ఎన్టీఆర్ కెరియర్ లో కూడా స్టూడెంట్ నెంబర్ చాలా పెద్ద హిట్. ఎన్టీఆర్ కి హీరోగా అది రెండో సినిమా కావడం విశేషం. దాని తర్వాత ఆది, సింహాద్రి సినిమాలతో వరుస హిట్స్ అందుకొని తారక్ చిన్న వయస్సులోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. అయితే ఎన్టీఆర్ తో రాజమౌళి ఫస్ట్ మూవీని అయిష్టంగానే మొదలు పెట్టారని చాలామందికి తెలియదు.
ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకి ఎన్టీఆర్ హీరో అనగానే రాజమౌళి ముందుగా భయపడ్డాడంట. ఆ సినిమాకి ఎన్టీఆర్ వయస్సు తక్కువ కావడం. అలాగే బాడీ లాంగ్వేజ్ కాని, అలాగే పేస్ లుక్ గాని సరిగా లేకపోవడంతో రాజమౌళి కొద్దిగా ఇబ్బంది పడ్డారంట. ఈ విషయాన్ని ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో రాజమౌళి తెలిపారు. అయితే ఎప్పుడైనా కుంటి గుర్రంతో యుద్ధం చేయడం అంటే నాకు ఇష్టం. అందుకే దానిని చాలెంజింగ్ గా తీసుకొని మూవీ చేశానని ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
అలాంటి జూనియర్ ఎన్టీఆర్ తోనే రాజమౌళి కెరియర్ లో ఎక్కువ సినిమాలు చేయడమే కాకుండా అన్ని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్నాడు. సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ మూవీస్ రాజమౌళి ఇమేజ్ ని పెంచేశాయి. అలాగే తారక్ ని కూడా ఆర్ఆర్ఆర్ గ్లోబల్ స్టార్ ని చేసింది. రాజమౌళి ఇంటర్వ్యూ బట్టి ఆరంభంలో ఎవరైతే తనతో సినిమా చేయడానికి ఇష్టపడిన వ్యక్తి మళ్ళీ తారక్ తోనే ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.
ఓ విధంగా తారక్ తనని తాను ఎలా ట్రాన్స్ ఫర్మేషన్ చేసుకున్నారు. ఈ రోజు ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకడిగా ఎలా నిలబడ్డాడు అనేది చాలా మంది ఇన్ స్పైర్ చేసే అంశం అని చెప్పాలి. ఇప్పుడు తారక్ దేవర మూవీతో నెక్స్ట్ లెవల్ కి తన ఇమేజ్ ని పెంచుకుంటూ వెళ్తున్నాడు.