Begin typing your search above and press return to search.

రూ.10 కోట్లు కాకుంటే 'ఈగ' ఆపేసేవాడిని...!

ఈగ సినిమా కు సంబంధించిన విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఈగ సినిమా ఎలా మొదలయ్యింది.. అందుకోసం పడ్డ కష్టం గురించి జక్కన్న తెలియజేశాడు.

By:  Tupaki Desk   |   16 Jan 2024 5:30 PM GMT
రూ.10 కోట్లు కాకుంటే ఈగ ఆపేసేవాడిని...!
X

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు కూడా దేనికి అదే అన్నట్లుగా విభిన్నంగా ఉండటంతో పాటు బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అన్నింటిలోకి రాజమౌళి 'ఈగ' సినిమా అత్యంత విభిన్నమైనది అనడంలో సందేహం లేదు.

రాజమౌళికి వీఎఫ్‌ఎక్స్ పై అభిరుచి, ఆసక్తి కలిగించిన సినిమా ఈగ. ఆ విషయాన్ని రాజమౌళి గతంలో పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఈగ సినిమా కు సంబంధించిన విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఈగ సినిమా ఎలా మొదలయ్యింది.. అందుకోసం పడ్డ కష్టం గురించి జక్కన్న తెలియజేశాడు.

రాజమౌళి మాట్లాడుతూ... నేను నాన్న గారి వద్ద సహాయ దర్శకుడిగా చేస్తున్న సమయంలోనే ఈగ కథ ను చెప్పారు. ఆ సమయంలో కథ విని చాలా నవ్వుకున్నాం. ఆ కథ ను సినిమా తీయాలని ఎప్పుడూ అనుకోలేదు. నేను దర్శకుడిగా సినిమాలు చేయడం మొదలు పెట్టిన తర్వాత వరుసగా భారీ చిత్రాలను తీస్తూ వచ్చాను. సింహాద్రి మరియు చత్రపతి తర్వాత ఒక చిన్న కథ తో సినిమాను చేయాలి అనుకున్నాను.

నాకు లవ్‌ స్టోరీ లు, కామెడీ సినిమాలు తీయడం, రాయడం చేతనవ్వదు. అందుకే నేను ఈగ కాన్సెప్ట్‌ సినిమా తో సినిమా తీయాలని నిర్ణయించుకున్నాను. అయితే మగధీర, మర్యాద రామన్న సినిమాల తర్వాత అది సాధ్యం అయ్యింది. ఈగ సినిమాను మొదట రెండున్నర కోట్ల రూపాయల బడ్జెట్‌ తో రూపొందించాలని భావించాం.

కథను విస్తరిస్తున్న సమయంలో, సన్నివేశాలు రాసుకుంటూ బడ్జెట్‌ వేస్తున్న సమయంలో ఇది చిన్న బడ్జెట్‌ తో అయ్యేది కాదు అని భావించాం. దాంతో వెనక్కి తగ్గాలని అనుకున్నాం. అయితే సురేష్ బాబు గారు మా వద్దకు వచ్చి ఎంత బడ్జెట్‌ అయినా పర్వాలేదు చేద్దాం అన్నట్లుగా మాకు ధైర్యం ఇచ్చి చిన్న సినిమాను కాస్త పెద్దగా రూపొందించేందుకు బాటలు వేశారు.

గ్రాఫిక్స్ ఎక్కువ అవసరం అని మేము భావించాం. మకుట సంస్థతో కలిసి ఈగ క్యారెక్టర్‌ కి సంబంధించిన వర్క్ మొదలు పెట్టాం. సాధారణంగా అయితే క్యారెక్టర్ ను మేము డిజైన్ చేయించి ఇస్తే మకుట వారు గ్రాఫిక్స్ వర్క్‌ చేయాల్సి ఉంటుంది. కానీ ఈగ డిజైన్ విషయంలో మాకు క్లారిటీ లేకపోవడం తో ఆ డిజైన్‌ వర్క్‌ ను కూడా వారినే చూసుకోమన్నాం.

మకుట వారు చాలా నెలల తర్వాత ఈగ క్యారెక్టర్ తో ఒక వీడియోను తయారు చేసి తీసుకు వచ్చారు. అందులో అత్యంత పరమ చెత్తగా ఈగ కనిపించింది. ఈగ అసహ్యంగా కనిపించింది. దాంతో మేము సినిమాను ఆపేద్దాం అనుకున్నాం. కానీ అప్పటికే రూ.10 కోట్లు ఖర్చు చేశాం. రూ.50 లక్షలు, కోటి వరకు ఖర్చు చేసి ఉంటే సినిమాను ఆపేసేవాడిని.. కానీ 10 కోట్ల రూపాయలు ఖర్చు చేయడంతో వెనక్కి పోలేని పరిస్థితి నెలకొంది.

ఈగ క్యారెక్టర్ కోసం మొదట ఈగలను పట్టుకుని ఫోటో షూట్స్ చేశాం. ఆ తర్వాత డిజైన్‌ మొదలు పెట్టాం. అలా చిన్న సినిమా కాస్త చాలా పెద్ద సినిమా అయ్యింది అన్నట్లుగా దర్శకుడు రాజమౌళి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.