Begin typing your search above and press return to search.

రేవ్ పార్టీ.. రాజమౌళి ముందే చెప్పాడా?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించే పేరు రేవ్ పార్టీ. ఈ మధ్యకాలంలో బెంగళూరులో రేవ్ పార్టీని అక్కడి పోలీసులు బ్రేక్ చేశారు

By:  Tupaki Desk   |   29 May 2024 3:59 AM GMT
రేవ్ పార్టీ.. రాజమౌళి ముందే చెప్పాడా?
X

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించే పేరు రేవ్ పార్టీ. ఈ మధ్యకాలంలో బెంగళూరులో రేవ్ పార్టీని అక్కడి పోలీసులు బ్రేక్ చేశారు. గతంలో హైదరాబాద్ లో కూడా రేవ్ పార్టీలు విస్తృతంగా జరుగుతూ ఉండేవి. ఇక ఈ పార్టీలలో విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగం ఉంటుందని ప్రచారం ఉంది. అలాగే అసాంఘిక కార్యకలాపాలు కూడా విస్తృతంగా జరుగుతాయని పోలీసులకి వచ్చే సమాచారం మేరకు వీటిపై రైడ్స్ చేస్తూ ఉంటారు.

ప్రైవేట్ పార్టీ అనే ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే వాటికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో రేవ్ పార్టీల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ నడుస్తోంది. అసలు రేవు పార్టీ కల్చర్ ఎలా ఉంటుంది? రేవ్ పార్టీలలో పాల్గొనేవారు ఏం చేస్తారు?. ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సై సినిమాలో ఒక క్లిప్ వైరల్ అవుతోంది.

కాలేజీలో సీనియర్స్, జూనియర్స్ పార్టీ ఉంటుంది. అందులో సీనియర్స్ అందరూ మాస్కులు వేసుకొని ఒక్కో అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ అమ్మాయి తోనే ఆ నైట్ అంతా టైమ్ స్పెండ్ చేయాలని కండిషన్స్ పెట్టుకుంటారు. ఇందులో హీరో, హీరోయిన్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. రేవ్ పార్టీ గురించి రాజమౌళి ఎప్పుడో దశాబ్దం క్రితమే హింట్ ఇచ్చాడు అంటూ ఈ వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

రేవ్ పార్టీ కల్చర్ ఇంచుమించు ఇదే తరహాలో ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజమౌళి రేవ్ పార్టీ కల్చర్ ని కొంతవరకు మాత్రమే సై చిత్రంలో చూపించాడని నెటిజన్లు ఆ వీడియో క్లిప్ పై రియాక్ట్ అవుతున్నారు. అయితే సై మాత్రమే కాకుండా చాలా కమర్షియల్ సినిమాలలో రేవ్ పార్టీల సీన్స్ ని కథలో భాగంగా తీసుకుంటారు.

సినిమాలలో ఉన్న ఐటెం సాంగ్స్ ని కూడా ప్రైవేట్ ప్లేస్ లలో రేవ్ పార్టీల తరహాలోనే చిత్రీకరిస్తూ ఉంటారు. సిటీ లైఫ్ లో పబ్ కల్చర్ విపరీతంగా పెరిగింది. దీనికి మరింత అడ్వాన్ గా రేవ్ పార్టీ కల్చర్ ఒక వైరస్ గా స్ప్రెడ్ అవుతుందనేది పబ్లిక్ మాట. వీటికి ఆదిలోనే ఫుల్ స్టాప్ పెడితే ఇలాంటి కల్చర్ కి యూత్ అడిక్ట్ కాకుండా ఉంటారని అంటున్నారు.