Begin typing your search above and press return to search.

RRR: ఆ పాత్రను చంపేయాలనుకున్న జక్కన్న!

RRR సినిమా వచ్చి రెండేళ్ళు పూర్తవుతున్న కూడా ఇంకా ఆ సినిమా రికార్డులు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉన్నాయి

By:  Tupaki Desk   |   19 March 2024 10:52 AM GMT
RRR: ఆ పాత్రను చంపేయాలనుకున్న జక్కన్న!
X

RRR సినిమా వచ్చి రెండేళ్ళు పూర్తవుతున్న కూడా ఇంకా ఆ సినిమా రికార్డులు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉన్నాయి. ఆ మూవీకి సంబంధించిన ఏదో ఒక విషయం కూడా హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. ఇక రీసెంట్ గా జపాన్ లో మరోసారి ఈ సినిమా సందడి చేసింది. ఆ సందడిలో దర్శకుడు రాజమౌళి కూడా పాల్గొన్నారు. ప్రత్యేకంగా కొన్ని షోలు ప్రదర్శించగా అక్కడ రాజమౌళికి ఆహ్వానం అందింది.

ఇక జపాన్ ప్రేక్షకుల ఆదరణను చూసి మురిసిపోయిన రాజమౌళి ఆ సెలబ్రేషన్స్ లో మహేష్ సినిమాకు సంబంధించిన ఒక చిన్న అప్డేట్ కూడా చెప్పాడు. అయితే RRR సినిమాలోని కొన్ని ప్రత్యేకమైన విషయాలను కూడా అక్కడ వివరించడం హైలెట్ అయ్యింది. ఇప్పటివరకు ఏ తెలుగు ఇంటర్వ్యూలో కూడా ఆయన ఆ విషయాలను పంచుకోలేదు. నిజానికి RRR సినిమాలో ఒక క్యారెక్టర్ ను చనిపోయే విధంగా మొదట రాసుకున్నారట.

ఆ విషయాన్ని ఆయన జపాన్ ఆడియన్స్ కు ఇలా వివరించారు. ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ కు జోడిగా ఒలివియా మెరీస్, జెన్నీ పాత్రలో కనిపించింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన కొన్ని సన్నివేశాలు చాలా లవ్లీగా అనిపించాయి. ముఖ్యంగా కొన్ని లవ్ సీన్స్ కూడా చిత్రీకరించినప్పటికీ వాటిని ఎడిటింగ్ లో తీసేసారట. అసలైతే జెన్నీ పాత్ర కథలో మొదట చనిపోయే విధంగా రాసుకున్నారట. అది ఎలా అంటే.. కొమరం భీమ్ జైల్లో ఉన్నప్పుడు ఆమె అంకుల్ స్కాట్ దగ్గర ఉన్న ఆర్మీ ప్లాన్ ను కొమరం భీమ్ కు అందించాలని ఆమె అనుకుంటుంది.

ఇక చివరి నిమిషంలో స్కాట్ భార్య, జెన్ని వారికి సహాయం చేస్తుంది అని పసిగడుతుంది. అప్పటికే భీమ్ క్యారెక్టర్, రామ్ సహాయంతో అక్కడి నుంచి పారిపోతాడు. అనంతరం రామ్ ను పట్టుకుని జైల్లో పెడతారు. ఈ క్రమంలో మళ్ళీ రాన్ కోసం జైలుకు రాగా అప్పుడు వారిద్దరిని లొంగిపోవాలని చెప్పిన స్కాట్ లేదంటే మీకు సహాయం చేసిన జెన్నీని చంపేస్తాను అని బెదిరిస్తాడు.

దీంతో లొంగిపోవాలి అనుకున్న ఆ ఇద్దరికీ చివరి నిమిషంలో స్కాట్ షాక్ ఇస్తాడు. వారికి సహాయం చేసిందని కోపంతో ఉన్న స్కాట్ జెన్నీని చంపేస్తాడు. ఆ విధంగా మొదట కథ రాసుకున్నట్లుగా చెప్పిన రాజమౌళి తర్వాత అంతా విషాధమైన ఎండింగ్ ఇవ్వకూడదు అనే కారణంతో కథలో మార్పులు చేసినట్లు చెప్పాడు. అంతే కాకుండా అలా చేసినందుకు చివరి వరకు కూడా మీరు చాలా హ్యాపీగా సినిమా చూశారు అని సరదాగా చెప్పడంతో అక్కడి వారు నవ్వేశారు.