Begin typing your search above and press return to search.

కట్టప్పకు జక్కన్న మళ్లీ ఛాన్స్ ఇచ్చారా? నిజమెంత?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ సినిమాల్లో కట్టప్ప పాత్ర ఎంత పాపులర్ అయిందో తెలిసిందే

By:  Tupaki Desk   |   31 May 2024 11:16 AM GMT
కట్టప్పకు జక్కన్న మళ్లీ ఛాన్స్ ఇచ్చారా? నిజమెంత?
X

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ సినిమాల్లో కట్టప్ప పాత్ర ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఆ రోల్ లో నటించిన కోలీవుడ్ స్టార్ యాక్టర్ సత్యరాజ్ పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్నారు. జక్కన్న తీర్చిదిద్దిన పాత్ర అలాంటిది మరి. అయితే సత్యరాజ్ ప్రస్తుత జనరేషన్ హీరోలకు సవాల్ విసురుతూ ఛాన్సులు దక్కించుకుంటున్నారు. మరో వారం రోజుల్లో వెపన్ మూవీతో వచ్చేందుకు రెడీ అయ్యారు.

అయితే బాహుబలిలో సింహాసనానికి కట్టుబానిస లాంటి రోల్ కోసం సత్యరాజ్‌ ను సెలెక్ట్ చేసుకున్న రాజమౌళి.. తన అప్ కమింగ్ మూవీ SSMB 29లో కూడా ఛాన్స్ ఇచ్చారని ఇటీవల వార్తలు వచ్చాయి. మహేష్ బాబు హీరోగా నటించనున్న ఈ మూవీలో సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తారని టాక్ వినిపించింది. అయితే సాధారణంగా తన సినిమాల్లో వర్క్ చేసిన కొందరిని సెంటిమెంట్ గా భావించి కొత్త చిత్రాల్లో ఛాన్స్ ఇస్తుంటారు రాజమౌళి.

ఇప్పుడు ఈ విషయంపై సత్యరాజ్ క్లారిటీ ఇచ్చారు. తన అప్ కమింగ్ మూవీ వెపన్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ లో ఛాన్స్ రావడంపై స్పందించారు. రాజమౌళికి ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. బాహుబలి సినిమాల్లో కట్టప్ప పాత్రతోనే తాను వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయినట్లు చెప్పారు. SSMB 29 మూవీలో నటించడం లేదని సత్యరాజ్ స్పష్టత ఇచ్చారు.

ఒకవేళ రాజమౌళి నటించమని అడిగితే కచ్చితంగా ఓకే చెప్తానని తెలిపారు సత్యరాజ్. ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ లో యాక్ట్ చేయనున్నట్లు వచ్చిన వార్తలపై మరోసారి స్పందించారు. మోదీ బయోపిక్ లో తాను నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు. కానీ తాను కొంచెం ఆయనలా కనిపిస్తానని తెలిపారు. ఎవరో తమ ఇద్దరి ఫోటోలు పక్కపక్కన పెట్టి తాను మోదీ బయోపిక్ లో నటిస్తున్నట్లు కొన్ని ఇమేజ్ లు షేర్ చేసినట్లు తెలిపారు.

ఇక రీసెంట్ గా విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన మజై పిడికతతా మనిథాన్ సినిమాలో కనిపించారు సత్యరాజ్. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కూలీలో యాక్ట్ చేస్తున్నారు. అనేక ఏళ్ల తర్వాత రజనీతో కలిసి వర్క్ చేస్తున్నారు. ఇక వెపన్ మూవీలో 28 ఏళ్ల యువకుడిగా కనిపించనున్నారు. అందుకు మేకర్స్ ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ ను ఉపయోగించారు. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.