ఒకే నెలలో ఇదేం దాడి సార్!
కొన్ని నెలలుగా రీ-రిలీజ్ ల ట్రెండ్ జోరుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల ఓల్డ్ క్లాసిక్ హిట్స్ ని మళ్లీ అభిమానుల ముందుకొస్తున్నారు
By: Tupaki Desk | 2 Dec 2023 7:32 AM GMTకొన్ని నెలలుగా రీ-రిలీజ్ ల ట్రెండ్ జోరుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల ఓల్డ్ క్లాసిక్ హిట్స్ ని మళ్లీ అభిమానుల ముందుకొస్తున్నారు. వాటిలో కొన్ని చిత్రాలు మంచి వసూళ్లు సాధిస్తుంటే.. మరికొన్ని మాత్రం ఏ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఎంత క్రేజ్ ఉన్న స్టార్ అయిన ఒక్కోసారి వర్కౌట్ అవ్వడం లేదని కొన్ని సినిమాల ఫలితాలు చూస్తుంటే తెలుస్తుంది.
తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రాన్ని ఏకంగా `యానిమల్` రిలీజ్ అయిన మరుసటి రోజు పెట్టి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం మార్కెట్ లో యానిమల్ దూకుడు కొనసాగుతుంది. యూత్ అంతా యానిమల్ కే వెళ్తున్నారు. మరి ఇలాంటి సమయంలో మళ్లీ `ముత్తు`ను చూడటానికి వెళ్లేదెవరు? అంటే చాలా కష్టమైన పనే అవుతుంది. రజనీకాంత్ సినిమాలకు పాత అభిమానులు వెళ్లే అవకాశం ఉంది తప్ప! పాత సినిమా కి కొత్త టికెట్ కొన్ని వెళ్లే వారు అయితే తక్కువగా ఉంటారు.
ఇప్పుడు ముత్తు పరిస్థితి అలాగే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు బాగానే దొరికాయి. `యానిమల్` తప్ప మిగతా సినిమాలేవి లేకపోవడంతో థియేటర్ల పరంగా ఇబ్బంది లేదు. కానీ టికెట్లు తెగడమే కష్టంగా కనిపి స్తుంది. షోలు కూడా చాలా పరిమితంగానే వస్తున్నారు. అయినా సినిమాకి వెళ్లడానికి ఆసక్తి చూపించడం లేదు. అయితే ఈ రీరిలీజ్ తెలుగు రాష్ట్రాల్లో కూకుండా విదేశాల్లో ప్లాన్ చేసి ఉంటే బాగుండేదని ఓ అభిమాని అభిప్రాయపడ్డాడు.
`ముత్తు` సినిమానే రజనీకాంత్ విదేశాల్లో భారీ పాపులారిటీని తెచ్చి పెట్టింది. అక్కడ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా అలా రిలీజ్ చేసి ఉంటే బాగుండేదని అంటున్నాడు. అలాగే డిసెంబర్ 12న రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా `శివాజీ`ని కూడా రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇది కూడా ఓవర్సీస్ లో భారీ వసూళ్లు సాధించిన చిత్రం. మరి ఇక్కడ రీ-రిలీజ్ లో ఎలాంటి ఫటితాలు సాధిస్తుంది అన్నది చూడాలి.