Begin typing your search above and press return to search.

ప్రభాస్ బర్త్‌ డే స్పెషల్‌ గా 'రాజాసాబ్‌'..!

ప్రభాస్‌ ప్రస్తుతం రాజా సాబ్‌ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   20 Sep 2024 5:42 AM GMT
ప్రభాస్ బర్త్‌ డే స్పెషల్‌ గా రాజాసాబ్‌..!
X

ప్రభాస్‌ ప్రస్తుతం రాజా సాబ్‌ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. సలార్‌, కల్కి 2898 ఏడీ వంటి బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ ను చేస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభించి చాలా కాలం అయినా ప్రభాస్ వరుస కమిట్మెంట్స్ కారణంగా డేట్లు కేటాయించడం సాధ్యం కాలేదు. ఇటీవల కల్కి సినిమా విడుదల తర్వాత బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ కి డేట్లు ఇవ్వడంతో మారుతి చకచకా రాజాసాబ్‌ సినిమాను ముగించే పనిలో ఉన్నాడు. రాజా సాబ్‌ సినిమా షూటింగ్‌ ఇప్పటికే సగానికి పైగా పూర్తి అయినట్లు సమాచారం అందుతోంది.

వచ్చే నెలలో ప్రభాస్ పుట్టిన రోజు రాబోతుంది. ఆ సందర్భంగా రాజాసాబ్‌ నుంచి సర్‌ప్రైజ్‌ ట్రీట్ ను ఇవ్వాలని దర్శకుడు మారుతి భావిస్తున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని చిత్ర యూనిట్‌ వర్గాల వారు చెబుతున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రాజా సాబ్‌ టీజర్ వస్తే బాగుంటుంది అనే అభిప్రాయంను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు మారుతి ఏం చేయబోతుంది అనేది ఆసక్తిగా మారింది. ప్రభాస్‌ ను మాస్‌ యాంగిల్ లో, చాలా రోజుల తర్వాత విభిన్నమైన గెటప్‌ లో చూపించబోతున్న మారుతి ఇవ్వబోతున్న సర్‌ప్రైజ్ ఏమై ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రభాస్ రాజా సాబ్‌ సినిమా లో లుంగీ కట్టి చేసే మాస్‌ సందడి కోసం ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రభాస్ చేసిన ప్రతి సినిమా వందల కోట్ల వసూళ్లు నమోదు చేస్తున్న విషయం తెల్సిందే. దాదాపు రూ.350 కోట్లతో రూపొందుతున్న రాజా సాబ్‌ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్స్ గా మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌ లు నటిస్తున్నారు. మరో హీరోయిన్‌ కూడా ఈ సినిమాలో కనిపించబోతుంది. ప్రభాస్ తో పాటు ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

ఈ మధ్య కాలంలో ప్రభాస్ నుంచి వచ్చిన సలార్‌, కల్కి 2898 ఏడీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దాదాపు వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే. అదే జోష్ ను ప్రభాస్ కంటిన్యూ చేస్తూ రాజా సాబ్‌ సినిమాతో వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. హర్రర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా పాన్‌ ఇండియా సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా హిందీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూసే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సమ్మర్‌ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.