'రాజాసాబ్' సంక్రాంతి లుక్ చూశారా..!
తాజాగా సంక్రాంతి కానుకగా చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేసిన పోస్టర్‌తో సినిమా ఏప్రిల్ నెలలో సినిమా లేదు అంటూ కన్ఫర్మ్ అయ్యింది.
By: Tupaki Desk | 14 Jan 2025 4:41 AM GMTప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది కనుక ఏప్రిల్‌లో ముందుగా నిర్ణయించిన తేదీకి వస్తుందని అంతా భావిస్తున్న సమయంలో చిత్ర యూనిట్ సభ్యుల నుంచి సినిమా ఆలస్యం అంటూ లీక్ వచ్చింది. మారుతి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినా రాజాసాబ్ సినిమా వాయిదా అని దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. తాజాగా సంక్రాంతి కానుకగా చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేసిన పోస్టర్‌తో సినిమా ఏప్రిల్ నెలలో సినిమా లేదు అంటూ కన్ఫర్మ్ అయ్యింది.
సంక్రాంతి కానుకగా పలు సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చాయి. మారుతి రాజాసాబ్ నుంచి ఎలాంటి అప్డేట్ ఇస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ప్రభాస్ డీసెంట్ లుక్‌ను షేర్ చేయడం ద్వారా ఫ్యాన్స్‌కి సంక్రాంతికి పెద్ద కానుక ఇచ్చాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన రాజాసాబ్ సినిమా ఇదే ఏడాది సమ్మర్‌లో విడుదల చేయాలని మారుతి భావిస్తున్నప్పటికీ ప్రభాస్‌కి ఇటీవల జరిగిన యాక్సిడెంట్ కారణంగా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాదాపు మూడు సంవత్సరాలుగా ఈ సినిమా గురించి ఫ్యాన్స్ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి సినిమా గురించి సంక్రాంతి సందర్భంగా మాట్లాడుకునే విధంగా తాజా పోస్టర్ ఉంది.
గత కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్‌ను మాస్ లుక్‌లో చూసి ఫ్యాన్స్‌కి బోర్ కొట్టింది. ఈ సినిమాలో చాలా విభిన్నంగా మిర్చి లెవల్‌కి వెళ్లి మరీ ప్రభాస్ కనిపించబోతున్నాడు. హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాను అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఫ్యాన్స్‌తో ఇండస్ట్రీ వర్గాల వారు కోరుకుంటున్నారు. సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా ఫలితంపై ప్రతి ఒక్కరూ ఆసక్తిని కనబర్చుతూ ఉన్నారు. రాజాసాబ్ తో ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టేనా అనేది అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది. ప్రభాస్ లుక్‌కి ఇప్పటికి అయితే పాస్ మార్కులు దక్కాయి.
ప్రభాస్‌కి జోడీగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. మెయిన్ లీడ్‌గా మాళవిక మోహనన్ నటిస్తూ ఉండగా నిధి అగర్వాల్, రిద్ది ఇతర పాత్రల్లో కనిపించబోతున్నారు. మొదటి సారి ప్రభాస్ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు ఉండటంతో పాటు, హర్రర్ కామెడీ ఉండబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో తెలుగులో రూపొందుతున్న ఈ సినిమాను అన్ని భాషల్లోనూ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. హిందీలో ఈ సినిమాను భూషన్ కుమార్ విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది.