ముగ్గురు భామల మధ్యలో రాజాసాబ్ రయ్ రయ్!
తాజాగా ఈ ముగ్గురి మధ్యలో ప్రభాస్ తో ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తోంది.
By: Tupaki Desk | 18 March 2025 11:43 AM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో 'రాజాసాబ్' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మారుతి మార్క్ కామెడీ ఎంటర్ టైనర్ ఇది. ఇంకా ఈ సినిమా ఆన్ సెట్స్ లోనే ఉంది. షూటింగ్ క్లైమాక్స్ లో ఉంది. ఇందులో ప్రభాస్ కి జోడీగా ముగ్గురు భామలు నటిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిధి కుమార్ నటిస్తున్నారు. తాజాగా ఈ ముగ్గురి మధ్యలో ప్రభాస్ తో ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తోంది.
పాటలకు సంబంధించిన అప్ డేట్ సంగీత దర్శకుడు థమన్ అందించాడు. ప్రభాస్ పై ఓ స్పెషల్ ఇంట్రో సాంగ్ ఉంటుంది. అలాగే ఓ మెలోడీ సాంగ్ తో పాటు లవ్ బుల్ సాంగ్, స్పెషల్ ఐటం నెంబర్ కూడా ఉంటుంది. ఈ ముడింటిలో డార్లింగ్ కనిపిస్తారు. ప్రభాస్ చాలా రోజుల తర్వాత ఓ కమర్శియల్ సాంగ్ లో కనిపిస్తారు. అది ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ నటించే సాంగ్ హైలైట్ గా ఉంటుంది. ఇకపై పాటల చిత్రీకరణ ఉంటుంది. అనంతరం ఒక్కో పాటను రిలీజ్ చేస్తాం` అన్నారు.
థమన్ అప్ డేట్ తో రాజాసాబ్ రిలీజ్ ఇంకా చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ అది జరిగేలా లేదు. షూటింగ్ సహా పాటల చిత్రీకరణ ఇంకా పెండింగ్ లోనే ఉంది. ప్రభాస్ రాజాసాబ్ షూటింగ్ తో పాటు పౌజీ షూటింగ్ కి కూడా ఏకకాలంలో హాజరవ్వడంతో పూర్తి చేయలేకపోతున్నారు.
అయితే మే నుంచి కల్కి రెండవ భాగం షూటింగ్ కూడా మొదలవుతుంది. జూన్ నుంచి ప్రభాస్ ఆ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటారు. కమల్ హాసన్- ప్రభాస్ పై కాంబినేషన్ సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. మే నుంచి ఆ సినిమా షూట్ కి కూడా వెళ్తే `రాజాసాబ్` మరింత డిలే అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.