Begin typing your search above and press return to search.

#రాజాసాబ్.. ఇదేదీ నిజం కాదు

ఈ భారీ ఎంటర్‌టైనర్‌పై ర‌క‌ర‌కాల ఊహాగానాలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   7 Sep 2024 10:01 AM GMT
#రాజాసాబ్.. ఇదేదీ నిజం కాదు
X

ప్రభాస్ న‌టించిన పాన్ ఇండియ‌న్ చిత్రం కల్కి 2898 AD దాదాపు 1200 కోట్ల వ‌సూళ్ల‌తో చాలా సినిమాల రికార్డుల‌ను తిర‌గ‌రాసిన సంగ‌తి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ డ్రామాతో ప్రభాస్ తన స్టార్‌డమ్‌ను మరోసారి నిరూపించుకున్నాడు. OTT లోను క‌ల్కి హ‌వా సాగిస్తోంది. తదుపరి ప్ర‌భాస్ రొమాంటిక్ హారర్ కామెడీ `ది రాజా సాబ్‌`లో కనిపించనున్నారు. మారుతీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ భారీ ఎంటర్‌టైనర్‌పై ర‌క‌ర‌కాల ఊహాగానాలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ది రాజా సాబ్ ఆడియో హక్కులను అంతగా పాపులర్ కాని మ్యూజిక్ లేబుల్‌కి రూ.15 కోట్ల‌కు విక్రయించినట్లు పుకారు వినిపిస్తోంది. ఇది ప్రభాస్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. అయితే ఇవి కేవ‌లం పుకార్లు మాత్ర‌మే. ఇది నిజం కాద‌ని చెబుతున్నారు. ఎలాంటి ప్రకటన అయినా ప్రొడక్షన్ హౌస్ నుండి నేరుగా వస్తుంది. గాసిప్ రాయుళ్లు ఉద్దేశపూర్వకంగానే ప్రభాస్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఈ రూమర్స్ సృష్టిస్తున్నారని నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌.

రాజా సాబ్ చిత్రంతో మాళవిక మోహనన్ టాలీవుడ్ లో ను నిరూపించుకోవాల‌ని త‌పిస్తోంది. నిధి అగర్వాల్ అనూహ్యంగా ఈ చిత్రంలోకి ప్ర‌వేశించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ది రాజా సాబ్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

సింగంలో ప్ర‌భాస్- సూర్య నిజ‌మా?

బాలీవుడ్ లో రోహిత్ శెట్టి సింగం ఫ్రాంఛైజీ వేవ్స్ క్రియేట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇలాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క ఫ్రాంఛైజీలో ప్ర‌భాస్ అతిథి పాత్ర‌లో ఎంట్రీ ఇస్తున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అయితే దీనిని రోహిత్ శెట్టి కానీ అత‌డి టీమ్ కానీ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. ఇక త‌మిళంలో ఇదే పాత్ర‌లో సూర్య న‌టించే అవ‌కాశం ఉంద‌ని కూడా చెబుతున్నారు. కానీ అధికారికంగా ప్ర‌తిదీ వెల్ల‌డించాల్సి ఉంది.