Begin typing your search above and press return to search.

ప్రభాస్‌కి 'రాజాసాబ్‌' చాలా స్పెషల్‌

వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కాబోతున్న ఈ సినిమా ను దర్శకుడు మారుతి చాలా విభిన్నమైన హర్రర్‌ కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నారని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   19 Oct 2024 8:30 AM GMT
ప్రభాస్‌కి రాజాసాబ్‌ చాలా స్పెషల్‌
X

పాన్ ఇండియా సూపర్ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'రాజా సాబ్‌' సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కాబోతున్న ఈ సినిమా ను దర్శకుడు మారుతి చాలా విభిన్నమైన హర్రర్‌ కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నారని తెలుస్తోంది. మారుతి వంటి చిన్న దర్శకుడితో ఎలా ప్రభాస్ సినిమాను చేసేందుకు ఒప్పుకున్నాడు అంటూ గత రెండేళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు మారుతి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ లు ఇచ్చిన దాఖలాలు లేవు. అయినా ఆయన దర్శకత్వంలో సినిమాను చేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటో అని చాలా మంది ముక్కున వేలేసుకున్నారు.

మారుతి చెప్పిన కథ వల్లే ప్రభాస్‌ ఈ సినిమాకు ఓకే చెప్పాడట. ఇప్పటి వరకు తన నుంచి వచ్చిన సినిమాలతో పోల్చితే మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్‌ సినిమా చాలా స్పెషల్‌ గా ఉంటుందని ప్రభాస్ నమ్మాడట. మారుతి చెప్పిన కథ చాలా స్పెషల్‌ గా అనిపించడం వల్లే ఓకే చెప్పడం జరిగిందని కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ప్రభాస్‌తో పాటు ఆయన ఫ్యాన్స్ అందరూ రాజాసాబ్‌ పై ఇప్పుడు నమ్మకం పెంచుకుని ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ చాలా మంది మారుతి దర్శకత్వంలో సినిమా వద్దు అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం రాజాసాబ్‌ సినిమా ఎప్పుడు వస్తుందా చూద్దామా అన్నట్లుగా వెయిట్‌ చేస్తున్నారు.

స్క్రిప్ట్‌ ను ప్రభాస్ బలంగా నమ్మడం వల్లే మారుతి గత చిత్రాలను గురించి పట్టించుకోకుండా ఓకే చెప్పడం జరిగింది. ప్రభాస్ సలార్‌, కల్కి, బాహుబలి, సాహో వంటి భారీ యాక్షన్ సినిమాలను చేయడం జరిగింది. అయితే ఈ సినిమా వాటికి పూర్తి ఆపోజిట్‌ గా ఉంటుంది. అంటే సినిమాలో భారీ యాక్షన్ ఉండక పోవచ్చు కానీ మంచి థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్ మాత్రం ఉంటాయి. బాలీవుడ్‌ స్టార్ సంజయ్ దత్‌ ఈ సినిమాలో ప్రభాస్ తాత పాత్రలో కనిపించబోతున్నాడని, ఆయన చనిపోయి ఆత్మగా ప్రభాస్‌తో మాట్లాడుతూ ఉంటాడు అని లీక్‌లు వస్తున్నాయి. ఇప్పటి వరకు సినిమా కథ గురించి మాత్రం మేకర్స్ అధికారికంగా ఎక్కడా రివీల్‌ చేయలేదు.

ఈనెల 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ లేదా కాన్సెప్ట్‌ పోస్టర్‌ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవలే నిర్మాత ఎస్‌కేఎన్ ఆ విషయాన్ని ప్రకటించాడు. ప్రభాస్ ను పదేళ్ల తర్వాత ఒక కొత్త పాత్రలో, విభిన్నమైన చిత్రంలో చూడబోతున్నందుకు ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌ ఆరంభంలో రాబోతున్న రాజాసాబ్‌ సినిమా ఇండస్ట్రీ హిట్‌ గా నిలుస్తుందని మారుతి సన్నిహితులు అంటున్నారు. ఈ మధ్య కాలంలో ప్రభాస్ సినిమాల్లో తక్కువ బడ్జెట్‌ తో రూపొందిన సినిమాగా రాజాసాబ్‌ నిలిచిందని అంటున్నారు. దాదాపు మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్‌ ను రాజాసాబ్‌ సినిమాకు ఖర్చు చేయడం జరిగిందట. విడుదల సమయంలో ఈ లెక్క మరింత పెరిగిన ఆశ్చర్యం లేదు. కనుక ప్రభాస్ కి చాలా స్పెషల్‌ అయిన ఈ సినిమా ఏ స్థాయి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.