ప్రభాస్ పై తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ మూవీ తెరకెక్కుతోంది
By: Tupaki Desk | 18 Jan 2024 5:30 AM GMTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ మూవీ తెరకెక్కుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పాన్ ఇండియా ఇమేజ్ తో దూసుకుపోతున్న ప్రభాస్ మారుతితో సినిమా చెయ్యడం ఏంటి అని అందరూ షాక్ అయ్యారు. అయితే రెగ్యులర్ గా సీరియస్ కంటెంట్ లతో మూవీస్ చేస్తూ ఉండటం వలన కాస్తా రీఫ్రెష్మెంట్ కోసం కంప్లీట్ కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్ తో ఈ మూవీ చేస్తున్నాడంట.
ఇప్పటికే 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. తాజాగా మూవీ టైటిల్ ని ఎనౌన్స్ చేశారు. లుంగీలో ప్రభాస్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. దీంతో మూవీ ఎలా ఉండబోతోంది అనేది ఒక స్పష్టత వచ్చేసింది. నిజానికి ప్రభాస్ తో ఈ రోజుల్లో సినిమా చేయాలంటే కచ్చితంగా 200 నుంచి 300 కోట్లు బడ్జెట్ సిద్ధం చేసుకోవాల్సిందే. కంటెంట్ స్పాన్ పెరగడంతో ఆ స్థాయిలో బడ్జెట్ లు ఖర్చవుతున్నాయి.
అయితే మారుతి మాత్రం రాజాసాబ్ చిత్రాన్ని కేవలం 60 నుంచి 70 కోట్ల బడ్జెట్ లోనే పూర్తి చేయబోతున్నాడంట. ఈ చిత్రానికి ప్రభాస్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా వర్క్ చేస్తున్నాడు. మూవీ రిలీజ్ అయ్యాక లాభాల్లో వాటా మాత్రం తీసుకుంటాడంట. అలాగే ఈ చిత్రం కథ మొత్తం కంప్లీట్ గా ఒక బంగ్లా నేపథ్యంలోనే జరుగుతుంది. షూటింగ్స్ కోసం అవుట్ డోర్ కి ఎక్కువగా వెళ్లాల్సిన అవసరం లేదు. వీలైనంత వరకు ఒకే చోట సెట్స్ లలోనే షూట్ చేసేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ కారణంగానే బడ్జెట్ కూడా తక్కువ అవుతుందంట. ఈ లెక్కన చూసుకుంటే మూవీకి డిజిటల్ రైట్స్ ద్వారానే పెట్టుబడి కంటే డబుల్ ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే పాన్ ఇండియా లెవల్ లోనే ఈ చిత్రం రిలీజ్ కానున్న నేపథ్యంలో కచ్చితంగా భారీ లాభాలు వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఏ విధంగా చూసుకున్న ప్రభాస్ ఈ సినిమా లాభాల్లో వాటా ద్వారా మిగిలిన సినిమాల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.
ఆదిపురుష్ సినిమా రైట్స్ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కొనుగోలు చేసి తెలుగులో రిలీజ్ చేసింది. అయితే ఆ మూవీ డిజాస్టర్ కావడంతో నిర్మాతకి చాలా నష్టం వచ్చింది. ఆ లెక్కని రాజాసాబ్ చిత్రంతో ప్రభాస్ సరిచేస్తున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంతో మాళవిక మోహనన్ టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. నిధి అగర్వాల్, ఆషికా రంగనాథ్ కూడా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.