Begin typing your search above and press return to search.

రాజా సాబ్.. ఆ డేట్ కు పోటీ లేదు కానీ

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   22 Jan 2024 4:05 AM GMT
రాజా సాబ్.. ఆ డేట్ కు పోటీ లేదు కానీ
X

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. హర్రర్ కామెడీ జోనర్ లో ఈ మూవీ సిద్ధం అవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ ఏడాది ఆఖరులో మూవీని రిలీజ్ చేయడానికి మారుతి ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.

ప్రభాస్ రేసులో ఉన్నారంటే ఎంత పెద్ద హీరో అయిన తప్పుకోవాల్సిందే. లేదంటే డ్యామేజ్ గ్యారెంటీ అనే మాట ఇప్పుడు ఇండియా మొత్తం వినిపించే మాట. డిసెంబర్ 22న సలార్ మూవీ థియేటర్స్ లోకి సూపర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు అదే అదే టైంలో ఈ ఏడాది రాజా సాబ్ మూవీ రాబోతోంది. రాజాసాబ్ చిత్రానికి టాలీవుడ్ నుంచి అయితే పెద్దగా పోటీ ఏమీ లేదు.

కానీ బాలీవుడ్ నుంచి మాత్రం అక్షయ్ కుమార్ వెల్ కమ్ 3 మూవీ అదే టైంలో రాబోతోంది. అక్షయ్ కుమార్ కి వెల్ కమ్ సిరీస్ లు సూపర్ సక్సెస్ ఇచ్చాయి. అందులో మరో సీక్వెల్ రాబోతోంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉండబోతోంది. నిజానికి సౌత్ సినిమాలు, మరీ ముఖ్యంగా ప్రభాస్ సినిమాలలో యాక్షన్ జోనర్ లోనే వస్తేనే బాలీవుడ్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

సాహో సినిమాకి వచ్చే స్థాయిలో రాధేశ్యామ్, అధిపురుష్ సినిమాలకి రాలేదు. దీనిని బట్టి రాజాసాబ్ సినిమాకి నార్త్ ఆడియన్స్ నుంచి పెద్దగా ఆదరణ ఉండకపోవచ్చనేది సినీ విశ్లేషకుల మాట. అలాగే హర్రర్ కామెడీ జోనర్ వారికి కొత్తకాదు. ప్రభాస్ కాస్తా ఫ్రెష్ నెస్ కోసం ఈ మూవీ చేస్తున్న, ఇలాంటి కథలతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చేశాయి.

మరి మారుతి పాన్ ఇండియా స్థాయిలో రాజా సాబ్ చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నాడు. అలాగే ముగ్గురు హీరోయిన్స్ ని కూడా ప్రభాస్ కి జోడీగా పెట్టాడు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కూడా ఈ సినిమాలో నటిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ క్యాస్టింగ్ తో ఏమైనా ఆడియన్స్ ని రాజా సాబ్ కి కనెక్ట్ చేస్తాడేమో చూడాలి.