'రాజాసాబ్' కి ఈ చిక్కులేంటో కానీ!
ఒకవేళ సలార్ 2 కోసం ప్రభాస్ ఎక్కువ ప్రాధాన్యతనిస్తే, ఆటోమెటిగ్గా మారుతి `రాజా సాబ్` రిలీజ్ ఆలస్యమయ్యే ఛాన్సుంది.
By: Tupaki Desk | 24 Jan 2024 11:30 AM GMTప్రభాస్ నటించిన `సలార్` సంచలన విజయం సాధించిన నేపథ్యంలో పార్ట్ 2ని వేగంగా ప్రారంభించి, పట్టాలెక్కించేందుకు ఇదే వేడిలో రిలీజ్ చేసేందుకు ప్రశాంత్ నీల్ ఆసక్తిగా ఉన్నాడని ఇటీవల కథనాలొస్తున్నాయి. కేజీఎఫ్ విజయం నేపథ్యంలో కేజీఎఫ్ 2 కోసం ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే సెట్స్ కి వెళ్లిన ప్రశాంత్ నీల్ సీక్వెల్ తో అఖండ విజయం సాధించాడు. `కేజీఎఫ్ 2`ని 1000 కోట్ల క్లబ్ లో చేర్చడంలో నీల్ వ్యూహం, ప్రణాళిక, వేగం ఫలించాయి.
ఇప్పుడు అదే ఫార్ములాను `సలార్ 2` కోసం అప్లయ్ చేస్తున్నాడని సమాచారం. ఆలస్యం అమృతం విషం.. అందుకే వెనువెంటనే సలార్ 2ని పూర్తి చేసి రిలీజ్ చేసతే భారీ బజ్ ఉంటుందన్న అంచనాలు అతడికి ఉన్నాయి. అందుకే సలార్ 2 నిర్మాణాన్ని ఈ సంవత్సరం లోపు ప్రారంభించి అత్యంత వేగంగా ముగించగలిగితే విడుదలపైనా క్లారిటీ వస్తుంది. అయితే సగభాగం పూర్తయిన మారుతి-ప్రభాస్ జోడీ `రాజా సాబ్`కి సలార్ 2 ప్రణాళికలు ఆటంకం కాబోతున్నాయనేది ఒక విశ్లేషణ.
ఒకవేళ సలార్ 2 కోసం ప్రభాస్ ఎక్కువ ప్రాధాన్యతనిస్తే, ఆటోమెటిగ్గా మారుతి `రాజా సాబ్` రిలీజ్ ఆలస్యమయ్యే ఛాన్సుంది. మిగిలిన 50 శాతం చిత్రీకరణ డిలే అవుతుంది. ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో రాజా సాబ్ రిలీజవ్వాలంటే మారుతి వేగంగా చిత్రీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ప్రశాంత్ నీల్ సలార్ 2 ప్రీప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటే, ఈ గ్యాప్ లో మారుతి తన పెండింగ్ షూట్ ని పూర్తి చేసుకుని ఇతర పనుల్ని పూర్తి చేసే వీలుంటుందని భావిస్తున్నారు. అయితే ప్రభాస్ - ప్రశాంత్ నీల్ ప్లానింగ్ ఎలా ఉంటుంది? అన్నది కూడా ఇక్కడ చాలా కీలకం కానుంది. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాది చివరి నాటికే థియేటర్లలోకి `రాజా సాబ్` వచ్చేందుకు ఆస్కారం ఉంది. మరోవైపు నాగ్ అశ్విన్ మే9న కల్కి 2898AD చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని ప్రకటించేసారు గనుక దీనిపై పూర్తి స్పష్ఠత ఉంది. కానీ రాజా సాబ్ రిలీజ్ తేదీపైనే క్లారిటీ మిస్సయిందని గుసగుస వినిపిస్తోంది.