Begin typing your search above and press return to search.

రాజాసాబ్ కోసం నెవ్వర్ బిఫోర్ అనేలా..

అయితే, ఈ చిత్రంలో ఉపయోగించిన సెట్ మాత్రం ఆ అంచనాలను మరింత పెంచేసేలా ఉంటుందట

By:  Tupaki Desk   |   12 Aug 2024 4:31 PM GMT
రాజాసాబ్ కోసం నెవ్వర్ బిఫోర్ అనేలా..
X

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘రాజాసాబ్’ సైలెంట్ మొదలవ్వడంతో ఏదో చిన్న బడ్జెట్ సినిమా అని అందరు అనుకున్నారు. కానీ మొదలయ్యాక ఒక్కొక్క విషయం లీక్ అవుతుంటే ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా ఉంటుందని ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే ఈ తెలుగు సినిమా ప్రేమికుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.

అయితే, ఈ చిత్రంలో ఉపయోగించిన సెట్ మాత్రం ఆ అంచనాలను మరింత పెంచేసేలా ఉంటుందట. ఇండియాలోనే ఇంత పెద్ద సెట్‌ను ఉపయోగించడం ఇదే మొదటిసారి అని టీజీ విశ్వప్రసాద్, చిత్ర నిర్మాత, స్వయంగా వెల్లడించారు. ఈ భారీ సెట్ కంటే ముందు, ప్రభాస్ ప్రాజెక్ట్‌ల పరంగా దూసుకుపోతున్న విషయాన్ని గుర్తు చేయాలి.

ప్రభాస్, 'బాహుబలి'తో గ్లోబల్ స్టార్‌గా మారిన తర్వాత ప్రతి సినిమా కూడా భారీ స్థాయిలో రూపొందుతుంది. ఇటీవల కల్కి సినిమాతో ప్రభాస్ మరోసారి వెయ్యి కోట్ల బాక్సాఫీస్ ను టచ్ చేశాడు. ఇక ‘రాజాసాబ్’ సినిమా కూడా ఒక సరికొత్త ప్రమాణాన్ని సృష్టించబోతోందని అర్థమవుతోంది.

టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ, "ఇప్పటివరకు ఇండియాలో ఎవరూ కూడా ఇంత పెద్ద ఇండోర్ సెట్‌ను రూపొందించలేదు. ‘రాజాసాబ్’ కోసం 40 వేల చదరపు అడుగుల ఫ్లోర్‌లో అతి భారీ సెట్‌ను ఏర్పాటు చేశాం. ఈ సెట్‌లోనే సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ జరుగుతోంది," అని చెప్పారు. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఈ సెట్‌కి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.

కానీ ఇప్పుడు, ఈ సెట్ సినిమాకి ప్రధాన హైలైట్ అవుతుందని తెలుస్తోంది. సినిమా కథ మొత్తం ఒక పెద్ద కోట చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఈ కోట సెట్‌నే టీజీ విశ్వప్రసాద్ ప్రస్తావించడం జరిగింది. ఇంతవరకు సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయిందని, అక్టోబర్ చివరినాటికి టాకీ పార్ట్ పూర్తవుతుందని, ఆ తరువాత సాంగ్స్ చిత్రీకరణకు వెళ్లే అవకాశం ఉందని నిర్మాత చెప్పారు.

ఇంతటి భారీ సెట్స్‌తో పాటు గ్రాఫిక్స్ కూడా ఈ సినిమాకి ముఖ్యమైన అంశమని చెప్పవచ్చు. షూటింగ్‌తో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయని, గ్రాఫిక్స్ కోసం అవసరమైన మెటీరియల్‌ను ఇప్పటికే షూట్ చేసేశామని టీజీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. ‘రాజాసాబ్’ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలోకి విడుదలవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందనే చెప్పవచ్చు.