Begin typing your search above and press return to search.

రాజాసాబ్‌.. ప్రభాస్ ఏమి చెయ్యబోతున్నాడు!

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

By:  Tupaki Desk   |   21 July 2024 2:30 AM GMT
రాజాసాబ్‌.. ప్రభాస్ ఏమి చెయ్యబోతున్నాడు!
X

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సమయంలో ప్రభాస్ తదుపరి సినిమా గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. కల్కి సినిమా తర్వాత ప్రభాస్ తర్వాత రాబోతున్న సినిమాలు చాలానే ఉన్నాయి.

కల్కి సినిమా తర్వాత ప్రభాస్‌ స్థాయి మరింతగా పెరిగింది. పాన్ వరల్డ్‌ స్టార్‌ అంటూ ప్రభాస్ గుర్తింపు దక్కించుకున్నాడు. కనుక ఆయన తదుపరి సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా రాజాసాబ్‌ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్‌ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ఇప్పటికే సగానికి పైగా పూర్తి అయ్యింది. త్వరలోనే ప్రభాస్ జాయిన్ అయితే కొత్త షెడ్యూల్‌ ను షురూ చేయాలని దర్శకుడు మారుతి భావిస్తున్నాడని తెలుస్తోంది.

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు పలువురు ఇప్పటికి అయినా రాజాసాబ్ స్పీడ్‌ పెంచవచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముందు ముందు రాజాసాబ్ సినిమా కు సంబంధించిన షూటింగ్‌ మరింత స్పీడ్ చేస్తారనే చర్చ ఆ మధ్య జరిగింది. కానీ ఇంకా కల్కి హ్యాంగోవర్‌ లోనే ప్రభాస్ ఉన్నాడని తెలుస్తోంది.