Begin typing your search above and press return to search.

రాజాసాబ్.. లీక్ అలెర్ట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉన్నాడు.

By:  Tupaki Desk   |   9 July 2024 4:01 AM GMT
రాజాసాబ్.. లీక్ అలెర్ట్
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. అతనితో సినిమా చేయాలంటే నిర్మాతలు 300+ కోట్లకి పైగా బడ్జెట్ రెడీ చేసుకోవాల్సిందే. అలాగే దర్శకులు లార్జర్ దెన్ లైఫ్ లాంటి కథలని సిద్ధం చేసుకొని చెప్పాల్సి ఉంటుంది. అయిన కూడా వెంటనే డేట్స్ దొరుకుతాయని గ్యారెంటీ లేదు. కనీసం మూడేళ్లు అయన ప్రభాస్ తో మూవీ చేయాలంటే వెయిటింగ్ లిస్ట్ లో ఉండాల్సిందే.

ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో ఇప్పటి వరకు ఏ హీరోకి కూడా ఈ రేంజ్ ఇమేజ్, మార్కెట్ దొరకలేదు. స్టార్ హీరోలు అయిన కూడా కేవలం ఒక్క భాషకి మాత్రమే పరిమితం అయిపోయారు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ అన్ని భాషలకి చెందిన హీరోగా మారిపోయాడు. ఆయనతో పోటీగా సినిమా రిలీజ్ చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితి మిగిలిన స్టార్స్ కి వచ్చేసింది. షారుఖ్ ఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్ సలార్ తో పోటీ పడి నిలబడలేకపోయారు.

తాజాగా కల్కి 2898ఏడీతో ప్రభాస్ మరో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన లైన్ అప్ లో సలార్ పార్ట్ 2, స్పిరిట్ , హను రాఘవపూడి మూవీ, రాజాసాబ్ సినిమాలు ఉన్నాయి. వీటిలో రాజాసాబ్ షూటింగ్ సగానికి పైగా కంప్లీట్ అయ్యింది. వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ చేయాలనే టార్గెట్ తో తెరకెక్కిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇదిలా ఉంటే రాజాసాబ్ నుంచి ఫోటోలు లీక్ అయ్యాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొన్ని పిక్స్ ని వైరల్ చేస్తూ రాజాసాబ్ సినిమాలో స్టిల్స్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి ఎలాంటి ఫోటోలు లీక్ కాలేదంట. అలాగే సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పేరు జై సింగ్ ఆజాద్ అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పంజాబీ గెటప్ లో ఉన్న ప్రభాస్ ఫోటోని రాజాసాబ్ మూవీ స్టిల్ అంటూ వైరల్ చేస్తున్నారు.

జై సింగ్ ఆజాద్ అనే పేరు కూడా ఇంకా ఖరారు కాలేదంట. నిజానికి ఆ స్టిల్ కల్కి మూవీ ప్రమోషన్ సాంగ్ కోసం తీసుకున్నదని తెలుస్తోంది. అదే ఫోటోని రాజాసాబ్ పిక్స్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మూవీ అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు ఇలాంటి రూమర్స్ ని నమ్మొద్దని చిత్ర యూనిట్ కూడా ఫ్యాన్స్ కి విన్నవిస్తోంది.