Begin typing your search above and press return to search.

'కల్కి' తో సంబంధం లేకుండా రాజా సాబ్‌...!

కల్కి ప్రమోషన్ లో బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు మారుతి, థమన్ లకు ఆన్‌ లైన్ ద్వారా టచ్ లోకి వచ్చి ప్రభాస్ తన సలహాలు, సూచనలు, ఇన్‌ పుట్స్ ఇస్తున్నాడని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   26 Jun 2024 10:41 AM GMT
కల్కి తో సంబంధం లేకుండా రాజా సాబ్‌...!
X

ఇండియన్ సినీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ ప్రేమికులు కల్కి సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్లు హాలీవుడ్ సినిమాలను చూసి ఆహా ఓహో అనుకున్న ఇండియన్ సినీ ప్రేక్షకులు హాలీవుడ్‌ రేంజ్ లో రూపొందిన కల్కి సినిమాను చూడటం కోసం ఆసక్తిగా ఉన్నారు.

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి సినిమాలో ఇండియన్ సూపర్‌ స్టార్స్ అయిన అమితాబచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకునే లు నటించారు. ఇంకా ఈ సినిమాలో దిశా పటానీ, దుల్కర్ సల్మాన్, నాని, విజయ్ దేవరకొండ లు కూడా నటించి సినిమా స్థాయిని పెంచారు.

ఒక వైపు ప్రభాస్ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కల్కి సినిమా కోసం వెయిట్‌ చేస్తూ ఉంటే దర్శకుడు మారుతి మాత్రం ఆ విషయాలు ఏమీ పట్టకుండా తన రాజాసాబ్‌ సినిమా కోసం సంగీత చర్చల్లో మునిగి ఉన్నాడు. థమన్ తో కలిసి మెరీనా బీచ్ లో మారుతి మ్యూజిక్‌ సిట్టింగ్స్ లో ఉన్నాడట.

కల్కి ప్రమోషన్ లో బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు మారుతి, థమన్ లకు ఆన్‌ లైన్ ద్వారా టచ్ లోకి వచ్చి ప్రభాస్ తన సలహాలు, సూచనలు, ఇన్‌ పుట్స్ ఇస్తున్నాడని తెలుస్తోంది. మొత్తానికి కల్కి తో సంబంధం లేకుండా రాజా సాబ్ పనులు జరగడం ఆనందంగా ఉందని ప్రభాస్‌ ఫ్యాన్స్ అంటున్నారు.

మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ సినిమా ఏంట్రా అంటూ చాలా మంది ప్రకటించిన సమయంలో ముక్కున వేలేసుకున్నారు. మారుతి తో సినిమా వద్దని చాలా మంది ప్రభాస్‌ కి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ప్రభాస్ - మారుతి కాంబో ను ఎవరు అడ్డుకోలేక పోయారు.

వీరిద్దరి కాంబో మూవీ చాలా విభిన్నంగా ఉంటుందని, గత పదేళ్లుగా ప్రభాస్ ఫ్యాన్స్‌ ఏదైతే మిస్‌ అవుతున్నారో అదే ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా మారుతి సన్నిహితుల వద్ద అన్నాడట. ఇటీవల విడుదల అయిన ఫస్ట్‌ లుక్ సినిమా స్థాయిని పెంచి అంచనాలను పెంచింది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రాజా సాబ్‌ సందడి చేసే అవకాశాలు ఉన్నాయి.