Begin typing your search above and press return to search.

ఈ ప్లాన్ క్లిక్కయితే.. రాజా సాబ్ 1000 కోట్లు గ్యారెంటీ

చాలా రోజుల తర్వాత డార్లింగ్ ప్రభాస్ ని ఈ చిత్రంలో రొమాంటిక్ లుక్ లో ప్రేక్షకులు చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   31 July 2024 5:25 AM GMT
ఈ ప్లాన్ క్లిక్కయితే.. రాజా సాబ్ 1000 కోట్లు గ్యారెంటీ
X

డార్లింగ్ ప్రభాస్ కల్కి 2898ఏడీ మూవీ ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని రికార్డ్ స్థాయి వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. లాంగ్ రన్ లో ఈ సినిమా ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోయే 'ది రాజా సాబ్' సినిమా సందడి మొదలు కాబోతోంది. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ గ్లింప్స్ లో డార్లింగ్ ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడనే మాట వినిపిస్తోంది.

చాలా రోజుల తర్వాత డార్లింగ్ ప్రభాస్ ని ఈ చిత్రంలో రొమాంటిక్ లుక్ లో ప్రేక్షకులు చూస్తున్నారు. ఈ గ్లింప్స్ తో ది రాజా సాబ్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. మారుతి ఈ మూవీతో ఏదో మాయ చేయబోతున్నాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఏప్రిల్ 10, 2025న రాజా సాబ్ మూవీ థియేటర్స్ లోకి రానున్నట్లు అఫీషియల్ గా కన్ఫామ్ చేశారు. నిజానికి ఈ చిత్రాన్ని ముందుగా ఈ ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తారని భావించారు.

ఒకవేళ కుదరకుంటే 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. అయితే చిత్ర యూనిట్ మాత్రం వేరే విధంగా ఆలోచించింది. అందుకే ఏప్రిల్ 10న సమ్మర్ హాలిడేస్ కలిసి వచ్చే విధంగా ది రాజా సాబ్ రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసింది. ఏప్రిల్ నెలలో అంటే ఆల్ మోస్ట్ స్కూల్స్, కాలేజీలకు సమ్మర్ సెలవులు మొదలైపోతాయి. సమ్మర్ హాలిడేస్ ఆరంభంలోనే ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. కాబట్టి ప్రేక్షకులు కూడా ఎక్కువ ఆసక్తి చూపించే ఛాన్స్ ఉంది.

సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సుదీర్ఘ లాంగ్ రన్ లభించడం గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది. అలాగే 1000 కోట్ల కలెక్షన్స్ ఈజీగా అందుకోవచ్చని భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ లో సమ్మర్ స్పెషల్ గా ది రాజా సాబ్ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకొని రాబోతున్నారు. డార్లింగ్ ప్రభాస్ కెరియర్ లో పౌర్ణమి, మున్నా, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, బాహుబలి సినిమాలు ఏప్రిల్ నెలలో రిలీజ్ అయ్యి మెజారిటీగా సక్సెస్ అందుకున్నాయి.

ఈ నేపథ్యంలో ది రాజా సాబ్ సినిమాకి కూడా ఏప్రిల్ నెల కలిసి వస్తుందని భావిస్తున్నారు. గ్లింప్స్ రిలీజ్ తర్వాత డార్లింగ్ ఫాన్స్ ది రాజా సాబ్ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న థమన్ ది రాజా సాబ్ చిత్రంలో అదిరిపోయే డ్యాన్స్ నెంబర్స్ ఉంటాయని చెప్పారు. ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రొమాంటిక్ సాంగ్స్ ఉండే ఛాన్స్ ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఆ సాంగ్స్ రిలీజ్ అయితే మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.