Begin typing your search above and press return to search.

'రాజాసాబ్‌' షూటింగ్ ఇలా..!

ఆ సెట్టింగ్‌ లో ఏర్పాటు చేసిన ఒక గ్రీన్ మ్యాట్‌ కి అవతల వైపు ప్రభాస్ ఉన్న ఫోటోలను కొందరు తీసి వాటిని సోషల్‌ మీడియాలో షేర్ చేశారు.

By:  Tupaki Desk   |   24 Aug 2024 10:41 AM GMT
రాజాసాబ్‌ షూటింగ్ ఇలా..!
X

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా బ్యాక్‌ టు బ్యాక్ సలార్‌, కల్కి సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నాడు. ఆ రెండు సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్‌ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుంది అనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ లుక్‌ చూసిన తర్వాత చాలా మంది కూడా ఇది మరో విజయాన్ని ఆయనకు కట్టబెట్టడం ఖాయం అంటూ ధీమాతో ఉన్నారు.

మొన్నటి వరకు టైం ఉన్నప్పుడు మాత్రమే రాజాసాబ్‌ కి డేట్లు ఇస్తూ వచ్చిన ప్రభాస్ ఇప్పుడు రెగ్యులర్‌ గా షూటింగ్ లో పాల్గొంటున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రభాస్ రాజాసాబ్‌ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ లో జరుగుతోంది. 38 వేల చదరపు అడుగుల భారీ సెట్టింగ్‌ ను ఈ సినిమా కోసం ఏర్పాటు చేయడం జరిగిందట. ఆ సెట్టింగ్‌ లో ఏర్పాటు చేసిన ఒక గ్రీన్ మ్యాట్‌ కి అవతల వైపు ప్రభాస్ ఉన్న ఫోటోలను కొందరు తీసి వాటిని సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

రాజాసాబ్‌ సినిమా షూటింగ్‌ ను ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేసే విధంగా దర్శకుడు మారుతి ప్లాన్‌ చేస్తున్నాడు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది. వచ్చే సమ్మర్‌ లో ఈ సినిమాను విడుదల చేస్తారని సమాచారం అందుతోంది. ఏప్రిల్‌ 10న ఈ సినిమా ను విడుదల చేయాలని మారుతి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. సంజయ్ దత్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. ఇటీవలే విడుదల అయిన గ్లిమ్స్ కి మంచి రెస్పాన్స్‌ దక్కింది.

ప్రభాస్ రాజాసాబ్‌ సినిమాతో పాటు కల్కి 2, సలార్‌ 2 ఇంకా స్పిరిట్‌ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇటీవలే హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా కూడా ప్రారంభం అయ్యింది. ఆ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా ఇటీవలే ప్రారంభం అయ్యింది. 2025 లో అన్ని అనుకున్నట్లుగా జరిగితే రాజా సాబ్‌ సినిమాతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ సినిమాను కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్‌ ఇయర్ అనడంలో సందేహం లేదు.