Begin typing your search above and press return to search.

రాజా సాబ్.. ఎలాంటి అప్డేట్ రాబోతోంది?

ఈ నేపథ్యంలో మూవీ నుంచి గ్లింప్స్ లేదంటే టీజర్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట. ఒకవేళ వీలుకాకుంటే ఫస్ట్ సింగిల్ అయిన ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు.

By:  Tupaki Desk   |   27 July 2024 5:05 AM GMT
రాజా సాబ్.. ఎలాంటి అప్డేట్ రాబోతోంది?
X

డార్లింగ్ ప్రభాస్ నుంచి ఈ ఏడాది వచ్చిన కల్కి 2898ఏడీ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుని వరల్డ్ వైడ్ గా 1100 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ వసూళ్లు చేసిన చిత్రం ఇదే కావడం విశేషం. కల్కి సినిమాతో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులని మరోసారి తనవైపు తిరిగి చూసేలా ప్రభాస్ చేసుకున్నారు. ఈ చిత్రంతో ఆయన స్టామినా కూడా అమాంతం పెరిగింది. ఇండియాలో ఇతర హీరోలు ఎవరు కూడా ఆయన దరిదాపుల్లో లేరని చెప్పాలి.

నెక్స్ట్ డార్లింగ్ నుంచి రాబోయే సినిమాలపై ఇప్పుడు అందరు దృష్టి పడింది. వీటిలో ముందుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమా మోస్ట్ బజ్జింగ్ ప్రాజెక్ట్ గా ఉంది. ఇప్పటికే ఈ సినిమా 50% షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా లేదంటే సమ్మర్ స్పెషల్ గా రాజా సాబ్ సినిమాని థియేటర్స్ లోకి తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మరల ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ ఏకంగా 250 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మారుతి కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్, బిగ్ హీరో మూవీ ఇదే కావడం విశేషం. కంటెంట్ అండ్ టెక్నికల్ పరంగా మారుతి టాలెంట్ ఏంటనేది అందరికి తెలిసిందే. మారుతికి రాజా సాబ్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఓ మంచి అవకాశం లభించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు కేవలం ఒక పోస్టర్ మాత్రమే వచ్చింది.

కల్కి మూవీ బజ్ కంప్లీట్ అవ్వడంతో రాజా సాబ్ చిత్రాన్ని మార్కెట్ లోకి తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మూవీ నుంచి గ్లింప్స్ లేదంటే టీజర్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట. ఒకవేళ వీలుకాకుంటే ఫస్ట్ సింగిల్ అయిన ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అయితే వీటిలో ఏది ముందు తీసుకొస్తారనే చర్చ నడుస్తోంది. అలాగే ఎప్పుడు రిలీజ్ చేసే ఛాన్స్ ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది.

ఫ్యాన్స్ కూడా ఈ సినిమా నుంచి రాబోయే వీడియో కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలామంది గ్లింప్స్ రిలీజ్ చేయమని అడుగుతున్నారు. అయితే కల్కి సినిమా డార్లింగ్ ప్రభాస్ అభిమానుల ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. ఈ నేపథ్యంలో రాజా సాబ్ నుంచి రాబోయే కంటెంట్ ఏదైనా కూడా భారీ లెవెల్ లోనే ఉండాలని కోరుకుంటున్నారు. అది ఎంతవరకు సాధ్యమవుతుందనేది వేచి చూడాలి.