Begin typing your search above and press return to search.

శర్వా కోసం సీనియర్ హీరో.. సాలీడ్ రెమ్యునరేషన్!

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా డైరెక్టర్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   3 Feb 2025 11:30 AM GMT
శర్వా కోసం సీనియర్ హీరో.. సాలీడ్ రెమ్యునరేషన్!
X

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా డైరెక్టర్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. లూజర్ సిరీస్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న అభిలాష్.. ఇంట్రెస్టింగ్ స్టోరీతో రేసింగ్ బ్యాక్ డ్రాప్ తో శర్వానంద్ మూవీ రూపొందిస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

టైటిల్ ను జానీ అని ఫిక్స్ చేసినట్లు కొద్దిరోజులుగా టాక్ వినిపిస్తుండగా.. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. మాళ‌వికా నాయ‌ర్ హీరోయన్ గా నటిస్తుండగా.. ప్రెస్టీయ‌స్ బ్యాన‌ర్ యూవీ క్రియేషన్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఇప్పటికే ఆ బ్యానర్ పై శర్వా.. ర‌న్ రాజా ర‌న్‌, ఎక్స్ ప్రెస్ రాజా, మహానుభావుడు వంటి చిత్రాలు చేశారు.

అయితే శర్వా- అభిలాష్ కాంబోలో వస్తున్న సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. పవర్ ఫుల్ పాత్రలో ఆయన నటిస్తున్నారని, ఇప్పటికే షూటింగ్ లో కూడా పాల్గొన్నట్లు కొద్ది రోజుల క్రితం టాక్ వినిపించింది. రాజశేఖర్ ఇమేజ్ కు తగ్గట్టు పాత్రను డైరెక్టర్ మలిచినట్లు తెలుస్తోంది.

సినిమాలో శర్వానంద్ తండ్రి రోల్ లో రాజశేఖర్ కనిపించనున్నట్లు సమాచారం. స్టైలిష్ గా రోల్ ఉండనుందని టాక్. అయితే తన పాత్రకు గాను ఆయన భారీ పారితోషికం అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు 3 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ సొంతం చేసుకున్నారని టాక్ వస్తోంది. ఆ పాత్రకు కూడా ఆయన తక్కువ డేస్ లో షూటింగ్ లో పాల్గొంటున్నట్లు టాక్.

అయితే ఫామ్ లో లేకపోయినా కూడా రాజశేఖర్ కు సాలిడ్ రెమ్యునరేషన్ అందిందని చెప్పాలి. సోలోగా అనేక సినిమాలు చేసిన ఆయన.. హిట్ అందుకుని చాలా కాలం అయింది. గోరింటాకు తర్వాత ఆయన విజయం సొంతం చేసుకున్నట్లు దాఖలాలు లేవు. వివిధ సినిమాల్లో లీడ్ రోల్స్ పోషించినా.. మెప్పించలేకపోయారు.

ఆమధ్య శేఖర్ మూవీతో వచ్చి సక్సెస్ అందుకుంటారని అంతా అంచనా వేశారు. కానీ మూవీ కూడా తీవ్రంగా నిరాశపరిచింది. గత ఏడాది నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మూవీలో నటించినా.. ఆ సినిమా కూడా ఫ్లాప్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు శర్వానంద్ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన.. ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.