అవి చేస్తా అంటున్నా ఆయన్ను ఎవరు పట్టించుకోవట్లేదా..?
ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకుని తన యాక్షన్ సినిమాలతో అదరగొట్టిన రాజశేఖర్ ఇప్పుడు పూర్తిగా ట్రాక్ తప్పేశారు.
By: Tupaki Desk | 26 Feb 2025 3:30 PM GMTఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకుని తన యాక్షన్ సినిమాలతో అదరగొట్టిన రాజశేఖర్ ఇప్పుడు పూర్తిగా ట్రాక్ తప్పేశారు. సీనియర్ స్టార్స్ లో కొందరు ఇప్పటికీ హీరోగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తుంటే కొందరు మాత్రం హీరోగా వర్క్ అవుట్ అవ్వట్లేదు అని వ్లన్ గా మారి సినిమాలు చేస్తున్నారు. జగపతి బాబు, శ్రీకాంత్ లాంటి వారు స్పెషల్ రోల్స్ తో మెప్పిస్తూ వస్తున్నారు. జగపతి బాబు అయితే సెకండ్ ఇన్నింగ్స్ విలన్ గా అదరగొట్టేస్తున్నారు.
ఐతే రాజశేఖర్ కి మాత్రం అలాంటి అవకాశాలు కూడా రావట్లేదు. రాజశేఖర్ మొన్నీమధ్య దాకా కూడా సోలో సినిమాలు చేస్తూ వచ్చారు. 2019 లో ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో కల్కితో ఓకే అనిపించారు. ఐతే ఆ తర్వాత ఆర్జీవి తో దెయ్యం సినిమా చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. 2022లో శేఖర్ ఎలా వచ్చిందో అలా వెళ్లింది. 2023 లో నితిన్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో కెమియో రోల్ చేశారు రాజశేఖర్. ఆ సినిమా సక్సెస్ అయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ అది నిరాశ పరిచే సరికి డీలా పడ్డాడు.
ఇక తాను నెగిటివ్ రోల్ చేస్తా అన్నా సరే ఎవరు ఛాన్స్ లు ఇవ్వలేని పరిస్థితి అయ్యింది. సోలోగా ఛాన్స్ లు రాక సపోర్టింగ్ రోల్స్ చేస్తా అన్నా పట్టించుకోక రాజశేఖర్ కెరీర్ సందిగ్ధంలో పడింది. తను ఎలా ఉన్నా హీరోయిన్స్ గా కూతుళ్ల కెరీర్ అయినా సక్సెస్ ఫుల్ గా ఉందా అంటే అది కూడా లేదు. శివాని, శివాత్మిక ఇద్దరు కథాయికలుగా ఎంట్రీ ఇచ్చినా ఇద్దరు క్లిక్ అవ్వలేదు.
రాజశేఖర్ మాత్రమే మళ్లీ మరో ప్రయత్నం చేయాలని చూస్తున్నారు. ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధం అనేలా రాజశేఖర్ చెబుతున్నా ఆయనకు మాత్రం ఛాన్స్ లు ఇచ్చేందుకు ఎవరు ముందుకు రావట్లేదు. మరి రాజశేఖర్ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది చూడాలి. ఏదైనా ఒక సినిమాలో ఆయన విలనిజం వర్క్ అవుట్ అయితే మళ్లీ ఆయన వెంట పడతారని చెప్పొచ్చు. మరి ఆ అవకాశాన్ని ఎవరు ఇస్తారన్నది చూడాలి. ఇప్పటికీ రాజశేఖర్ ఫ్యాన్స్ ఆయన మార్క్ సినిమాలు చేయాలని కోరుతున్నారు కానీ అవి సరైన ఫలితాలు అందుకోవట్లేదు కాబట్టి మేకర్స్ కూడా అంతగా ఆసక్తి చూపించట్లేదు.