Begin typing your search above and press return to search.

సుకుమార్ అభిమాన హీరో ఇత‌డే!

మ‌రి పాన్ ఇండియా సంచ‌ల‌నం సుకుమార్ అభిమాన హీరో ఎవ‌రో? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

By:  Tupaki Desk   |   13 Jan 2025 7:30 AM GMT
సుకుమార్ అభిమాన హీరో ఇత‌డే!
X

ఇండ‌స్ట్రీలో అభిమాన హీరో ఎవ‌రు? ఏహీరో స్పూర్తితో ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చారంటే? అంద‌రి నోట వినిపించేది మెగాస్టార్ చిరంజీవి మాట‌. డైరెక్ట‌ర్ అయినా? హీరో అయినా? క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అయినా? ఆయ‌న స్పూర్తితోనే ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చామ‌ని చెబుతారు. అభిమానించే హీరో గా చిరంజీవి నామ స్మ‌ర‌ణే చేస్తుంటారు. మ‌రి పాన్ ఇండియా సంచ‌ల‌నం సుకుమార్ అభిమాన హీరో ఎవ‌రో? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అత‌డే యాంగ్రీమెన్ రాజశేఖ‌ర్. అవును.


సుకుమార్ అభిమానించే స్టార్ రాజశేఖ‌ర్. తన అభిమాన హీరో వల్ల తాను ఇండస్ట్రీలో ఏదైనా? చేయగలను అనే నమ్మకం క‌లిగింద‌ని సుకుమార్ అన్నారు. ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని లెక్క‌లు మాష్టారు రివీల్ చేసారు. రాజ‌శే ఖ‌ర్ న‌టించిన 'అంకుశం', 'ఆహుతి', 'అగ్రహం', 'తలంబ్రాలు', 'మగాడు' లాంటి సినిమాలు త‌న‌ని ఎంత‌గానో ప్ర‌భావితం చేసాయ‌న్నారు. చదువుకునే రోజుల్లో రాజశేఖర్ సినిమాలు బాగా చూసే వాడినన్నారు.

అలాంటివి చూసి త‌న స్నేహితులు వ‌న్స్ మోర్ అంటూ ఎంక‌రేజ్ చేసేవార‌న్నారు. ఇమేటేట్ చేయ‌డం వ‌ల్ల అభి మానులు కూడా ఏర్పాడ్డ‌ర‌న్నారు. సినిమాల్లోకి వెళ్తే ఏదైనా చేయ‌గ‌ల‌ను అనే న‌మ్మ‌కం అప్పుడే త‌న‌కి క‌లిగిం ద‌న్నారు. అలా సుకుమార్ కెరీర్ లో రాజ‌శేఖ‌ర్ కూడా కీల‌కంగా మారార‌ని చెప్పొచ్చు. రాజ‌శేఖ‌ర్ ఒక‌ప్పుడు ఎంత పెద్ద స్టార్ అన్న‌ది అంద‌రికీ తెలిసిందే. అత‌డికంటూ ప్ర‌త్యేక‌మైన అభిమానులున్నారు.

ఎన్నో వైవిథ్య‌మైన పాత్ర‌ల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ప్యాన్ బేస్ కూడా క్రియేట్ చేసుకున్నారు. మ‌హిళ‌ల్లోనూ ఆయ‌న్ని అభిమానించే వారెంతో మంది. ప్ర‌స్తుతం రాజశేఖ‌ర్ సినిమాలు పెద్ద‌గా చేయ‌డం లేదు. స్టార్ హీరోల చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల్లో అవ‌కాశాలు వ‌చ్చినా దూరంగా ఉంటున్నారు. విల‌న్ గా చాలా ఛాన్సులొచ్చాయి? కానీ రాజశేఖ‌ర్ మాత్రం అంగీక‌రించ‌డం లేదు. ఆ మధ్య నితిన్ న‌టించిన 'ఎక్స్ ట్రార్డిన‌రీ మ్యాన్' లో మాత్రం ఓ కీల‌క పాత్ర పోషించారు.