Begin typing your search above and press return to search.

ఇన్నాళ్లు వెయిట్‌ చేసి ఇలా చేశావు ఏంటి..?

యాంగ్రీ యంగ్‌ మ్యాన్ ఇమేజ్ తో సుదీర్ఘ కాలం పాటు హీరోగా సినిమాలు చేసి ఎన్నో సూపర్ హిట్స్ ను అందుకున్న సీనియర్ హీరో రాజశేఖర్‌.

By:  Tupaki Desk   |   12 Dec 2023 12:30 PM GMT
ఇన్నాళ్లు వెయిట్‌ చేసి ఇలా చేశావు ఏంటి..?
X

యాంగ్రీ యంగ్‌ మ్యాన్ ఇమేజ్ తో సుదీర్ఘ కాలం పాటు హీరోగా సినిమాలు చేసి ఎన్నో సూపర్ హిట్స్ ను అందుకున్న సీనియర్ హీరో రాజశేఖర్‌. ఒకప్పుడు టాలీవుడ్‌ స్టార్‌ హీరోల జాబితాలో ముందు వరుసలో నిలిచిన రాజశేఖర్‌ గత కొన్నాళ్లుగా సరైన హిట్స్ లేకపోవడంతో సినిమాల సంఖ్య చాలా తగ్గించాడు.


అడపా దడపా హీరోగా చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుచుతూ ఉన్న నేపథ్యంలో చాలా మంది రాజశేఖర్ ను క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా లేదా విలన్ గా మారాలని సూచించారు. అయితే రాజశేఖర్ మాత్రం మంచి సబ్జెక్ట్ ల కోసం వెయిట్‌ చేశాడు. గరుడవేగ సినిమా కి ముందు నుంచి కూడా చాలా చర్చలు జరిగాయి.

ఎట్టకేలకు నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాతో రాజశేఖర్ తన సెకండ్‌ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టారు. ఆ సినిమా లో రాజశేఖర్‌ కీలక పాత్రలో నటించాడు. ఆ సినిమా లో రాజశేఖర్‌ పాత్ర గురించి విడుదలకు ముందు ప్రధానంగా చర్చ జరిగింది. కానీ విడుదల తర్వాత పరిస్థితి వేరుగా ఉంది.

ఎక్స్‌ట్రా లో రాజశేఖర్‌ పాత్ర విషయంలో చాలా మంది ఆయన అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఇన్నాళ్లు వెయిట్‌ చేసింది ఇలాంటి నాసిరకం పాత్రలు చేయడానికా అంటూ ఫ్యాన్స్ సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టేందుకు ఇన్నాళ్లు వెయిట్‌ చేసిన రాజశేఖర్‌ ఇలాంటి ప్రాముఖ్యత లేని పాత్ర తో వస్తాడని అనుకోలేదని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రాజశేఖర్‌ కెరీర్‌ లో ఎన్నో పోలీస్‌ ఆఫీసర్ పాత్రల్లో నటించాడు. కనుక ఇతర హీరోల సినిమాల్లో నటించినా కూడా అలాంటి పవర్‌ ఫుల్‌ పాత్రల్లో నటిస్తేనే బాగుంటుంది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగపతి బాబు సెకండ్‌ ఇన్నింగ్స్ ను లెజెండ్‌ సినిమా తో మొదలు పెట్టి తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

రాజశేఖర్‌ కూడా అలాంటి ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు అయినా రాజశేఖర్ నుంచి అలాంటి సినిమా వస్తుందేమో చూడాలి. ముందు ముందు కూడా ఇలాంటి ప్రాధాన్యత లేని పాత్రల్లో నటిస్తే కచ్చితంగా ఆయన గురించి జనాలు మర్చిపోతారు అనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు.