తెలుగు కుర్రాళ్ల చేతికి MCU సూపర్ హీరో మూవీ?
సూపర్ హీరో ఒరిజిన్ స్టోరీతో MCU ప్రాజెక్ట్‌ను రూపొందించే అవకాశం ఇప్పుడు ఈ జోడీకి లభించడం సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. హిందీ సినీప్రముఖులు సీతా మీనన్‌తో కలిసి రాజ్ & DK ఈ సూపర్ హీరో సినిమాకి పని చేస్తారు.
By: Tupaki Desk | 22 Oct 2023 2:30 AM GMTవందలు, వేల కోట్ల బడ్జెట్లతో సినిమాలు తీయడం బిలియన్ డాలర్ వసూళ్లను కొల్లగొట్టడం ఎలానో ప్రఖ్యాత MCU (మార్వల్ సినిమాటిక్స్ యూనివర్శ్)కి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో. యూనివర్శల్ ఫార్ములాతో సినిమాల్ని తెరకెక్కించి ప్రపంచ దేశాల్లో విడుదల చేసి వేల కోట్లు ఖాతాలో మళ్లించడం వీళ్లకు అలవాటైన ప్రక్రియ. అవెంజర్స్ ఫ్రాంఛైజీతో వరుస పెట్టి బిలియన్ల కొద్దీ సొమ్ముల్ని ఎగరేసుకుపోయిన ఈ కంపెనీ మన తెలుగు కుర్రాళ్లను పిలిచి అవకాశం ఇవ్వడం అంటే ఆషామాషీనా? అది కూడా సూపర్ హీరో సినిమాకి పని చేయమని ఛాన్సివ్వడం అంటే ఎలా ఉంటుందో ఓమారు ఊహించుకుండి. ఒక రకంగా చెప్పాలంటే భారతీయ సినిమా చరిత్రలో ఇది ఒక సంచలనం అని చెప్పాలి. రాజమౌళి- రాజ్ కుమార్ హిరాణీ- భన్సాలీలు ఉన్న గొప్ప పరిశ్రమల నుంచి వీళ్లెవరికీ రాని పిలుపు మన తెలుగు కుర్రాళ్లు రాజ్ అండ్ డీకేకి వచ్చింది.
ఫ్యామిలీమ్యాన్ ఫ్రాంఛైజీతో రాజ్ అండ్ డీకే ప్రపంచ సినీయవనికపై తమదైన ముద్ర వేసారు. ఈ సిరీస్ ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఆదరించి అభిమానించారు. ఆ తర్వాత ఫర్జీ సిరీస్ తోను మరోసారి అలాంటి ముద్ర వేసిన రాజ్ అండ్ డీకే కెరీర్ లో పలు విజయవంతమైన సినిమాల్ని తెరకెక్కించారు. సిటాడెల్ భారతీయ వెర్షన్ ని వీరు రూపొందిస్తున్నారు. ప్రియాంక చోప్రా జోనాస్ & రిచర్డ్ మాడెన్ నటించిన సిటాడెల్ భారతీయ వెర్షన్ (వరుణ్ ధావన్- సమంత ప్రధానపాత్రలు) చిత్రీకరణ కోసం రాజ్ & DKని తీసుకువచ్చిన రస్సో బ్రదర్స్ ఇప్పుడు సరికొత్త సూపర్ హీరో సినిమా కోసం మార్వల్ స్టూడియోస్ కి రిఫర్ చేసారని తెలిసింది.
సూపర్ హీరో ఒరిజిన్ స్టోరీతో MCU ప్రాజెక్ట్‌ను రూపొందించే అవకాశం ఇప్పుడు ఈ జోడీకి లభించడం సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. హిందీ సినీప్రముఖులు సీతా మీనన్‌తో కలిసి రాజ్ & DK ఈ సూపర్ హీరో సినిమాకి పని చేస్తారు. రస్సో బ్రదర్స్ స్వయంగా మార్వల్ స్టూడియోకి రెఫరెన్స్ ఇవ్వడం ఇక్కడ పరిశీలించదగినది.
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఇప్పుడు న్యూఫేజ్ లో ప్రవేశించింది. భిన్నమైనప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి విభిన్న సంస్కృతులకు ప్రాతినిధ్యం వహించే సూపర్ హీరోలను తీసుకురావడానికి ఎంసియు కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. మిస్ కమలా ఖాన్ మార్వెల్స్ విశ్వంలోకి ప్రవేశించడం దీనికి అద్భుతమైన ఉదాహరణ. ఫర్హాన్ అక్తర్ కూడా ఆమెతో కలిసి పని చేసేందుకు ముందుకురావడం కూడా మనం చూశాం. మార్వల్ స్టూడియో ఇప్పుడు తెరవెనుక వారి బృందంతో పని చేయనుంది. తాజా నివేదికల ప్రకారం, మార్వెల్ ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం సీతా మీనన్ సహా రాజ్ & DKని నియమించుకుంది.
రస్సో బ్రదర్స్ గతంలో మార్వల్ స్టూడియో కోసం 'ఎవెంజర్స్: ఎండ్‌గేమ్' సహా కొన్ని అతిపెద్ద సినిమాలకు దర్శకత్వం వహించారు. రాజ్ అండ్ DK అందించిన కథలకు ఫ్లేవర్ ని మార్వెల్ అధినేతలు ఇష్టపడ్డారు. ఒక సూపర్ హీరో కోసం ఒక చక్కని కొత్త మూల కథను రూపొందించడానికి రాజ్ అండ్ డీకేతో మార్వల్ చర్చలు సాగించింది. కథను డెవలప్ చేసే ప్రాసెస్ లో ఉండగానే, రాజ్ అండ్ డీకేలకు వారు దర్శకత్వ బాధ్యతను అప్పగించారని తెలిసింది.
అయితే ఇంకా దేనినీ అధికారికంగా ధృవీకరించలేం. ఎందుకంటే ముందుగా సీతా మీనన్, రాజ్ & DK తదితరులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి వారు అందించిన ఫైనల్ బౌండ్ స్క్రిప్టును స్టూడియో ఇష్టపడాలి. వారు డైరెక్టర్లుగా పనిచేస్తారా లేదా అనేది భవిష్యత్తులో తేల్తుంది. మొదట, మార్వెల్ రాజ్ అండ్ డికె ప్రెజెంటేషన్ ను ఇష్టపడాలి. ప్రాథమిక డ్రాఫ్ట్ ఓకే అయిన తర్వాత, రైట్-అప్‌ను మెరుగుపరచడానికి అనేకమంది రచయితలతో చర్చలు జరుగుతాయి. ఆ తర్వాత మాత్రమే ఈ ఫీచర్ ప్రెజెంటేషన్ కోసం అసలు పని జరుగుతుంది. ప్రస్తుతం వారు సూపర్ హీరో మూలకథల్లో ఒక కొత్త క్యారెక్టర్‌ని అభివృద్ధి చేయడానికి నియమితులయ్యారు'' అని ఒక సోర్స్ వెల్లడించింది. నిజానికి ఇంతవరకూ వెళ్లడమే గొప్ప. ఇది నిజంగా భారతీయ సినిమాకు దాని వెనుక ఉన్న క్రియేటర్లకు అద్భుత విజయం. ముఖ్యంగా మన తెలుగు కుర్రాళ్లు ఇంత పెద్ద స్థాయికి ఎదిగడం అన్నది ప్రశంసించదగినది.