Begin typing your search above and press return to search.

బజ్ కాదు.. బ్యాడ్ లక్ తోడైతే..?

ఐతే రజినీకాంత్, ఆమీర్ ఖాన్ ఇదివరకే ఒకసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అప్పుడెప్పుడో వచ్చిన ఆటంక్ హై ఆటంక్ సినిమాలో ఇద్దరు కలిసి నటించారు. ఆ సినిమా డిజాస్టర్ కా బాప్ అయ్యింది.

By:  Tupaki Desk   |   10 Dec 2024 8:30 AM GMT
బజ్ కాదు.. బ్యాడ్ లక్ తోడైతే..?
X

అదేంటో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో ఆయన ఒక్కడే ఉంటే సరిపోతుంది కదా మళ్లీ స్పెషల్ క్యామియోస్ ఎందుకు అనే డౌట్ ఆయన ఫ్యాన్స్ కు ఉంటుంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో స్పెషల్ క్యామియోస్ సినిమాకు బాగా కలిసి వచ్చాయి. ఆ క్యామియోస్ వల్ల సినిమా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంది. ఐతే అదే ఫార్ములా ఇప్పుడు రజినీ చేస్తున్న కూలీ సినిమాకు ఫాలో అవుతున్నారు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఐతే అలాంటిది ఒకసారి అంటే ఓకే కానీ మళ్లీ మళ్లీ అంటే ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉండదు.

అందులోనూ ఆల్రెడీ ఒక డిజాస్టర్ రిజల్ట్ అందుకున్న కాంబినేషన్ ని సెట్ చేయాలని అనుకోవడం అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది. రజినీ కూలీ సినిమాలో మన కింగ్ నాగార్జున దాదాపు బ్యాడ్ గాయ్ అదే విలన్ గా కన్ఫర్మ్ అన్నట్టే లెక్క. ఐతే ఈ సినిమాలో కన్నడ ఉపేంద్ర కూడా నటిస్తున్నారు. వీరితో పాటు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెషనిస్ట్ ఆమీర్ ఖాన్ కూడా క్యామియో రోల్ చేస్తున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ జైపూర్ లో జరుగుతుంది. అక్కడే ఆమీర్ ఖాన్ సీన్స్ షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఐతే రజినీకాంత్, ఆమీర్ ఖాన్ ఇదివరకే ఒకసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అప్పుడెప్పుడో వచ్చిన ఆటంక్ హై ఆటంక్ సినిమాలో ఇద్దరు కలిసి నటించారు. ఆ సినిమా డిజాస్టర్ కా బాప్ అయ్యింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు కలిసి నటిస్తున్నారు. ఐతే ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఉన్నా కూడా ఈసారి అలాంటిదేమి జరగదని గట్టిగా ఫిక్స్ అయ్యి చేస్తున్నాడు లోకేష్ కనకరాజ్. ఖైదీ, విక్రం లతో తన సినిమాటిక్ యూనివర్స్ కి స్పెషల్ క్రేజ్ ఏర్పరచుకున్న లోకేష్ లియో తో జస్ట్ ఓకే అనిపించుకున్నాడు. ఐతే రాబోతున్న కూలీ మరోసారి తన డైరెక్షన్ టాలెంట్ చూపిస్తాడని అంటున్నారు.

ఆమీర్ ఖాన్ కూడా నెక్స్ట్ లోకేష్ తోనే సినిమా ఉంటుంది కాబట్టి అప్పటివరకు అతని డైరెక్షన్ లో నటించడం అలవాటు అవుతుందని కూలీలో క్యామియో రోల్ కి ఓకే చేశాడు. ఐతే ఈమధ్య సౌత్ సినిమాలు బాలీవుడ్ లో డామినేట్ చేస్తున్న ఈ టైం లో అక్కడ స్టార్స్ కూడా మన దర్శకులతో సినిమాలు చేయాలని చూస్తున్నారు. రజినీ కూలీలో స్టార్స్ అంతా వరుస కడుతున్నారు. మరి ఈ స్టార్ క్యామియో సినిమాకు ఎంత ప్లస్ అవుతుంది అన్నది రిజల్ట్ వస్తేనే తెలుస్తుంది.