Begin typing your search above and press return to search.

రజినీకాంత్ తో ఆ సీనియర్ డైరెక్టర్.. మళ్ళీ ఇన్నాళ్లకు

ఈ చిత్రాకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు, మరియు చిత్రబృందం 2025 వేసవికి సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

By:  Tupaki Desk   |   7 Oct 2024 3:30 AM GMT
రజినీకాంత్ తో ఆ సీనియర్ డైరెక్టర్.. మళ్ళీ ఇన్నాళ్లకు
X

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో ఇటీవల కొంత బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సూపర్ స్టార్ రికవరీ మోడ్‌లో ఉన్నారు. త్వరలోనే కోలుకుని తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న "కూలీ" మూవీ షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. ఈ చిత్రాకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు, మరియు చిత్రబృందం 2025 వేసవికి సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

అయితే, ఇది మాత్రమే కాకుండా రజినీకాంత్ వచ్చే సంవత్సరం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో "జైలర్ 2" చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన షూట్ 2024లో ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఈ చిత్రంపై కూడా మంచి హైప్ ఉంది, జైలర్ ఫ్రాంచైజ్‌లో రజినీకాంత్ మరోసారి తన స్టైల్‌లో అలరించనున్నారని అభిమానులు అంచనా వేస్తున్నారు.

తాజా బజ్ ప్రకారం, రజినీకాంత్ త్వరలోనే లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కూడా ఒక కొత్త ప్రాజెక్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇరువురి మధ్య కథపై చర్చలు జరుగుతున్నాయి, మరియు అన్ని సానుకూలంగా ఉంటే ఈ ప్రాజెక్ట్‌ను రజినీకాంత్ పుట్టినరోజైన డిసెంబర్ 12న అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

రజినీకాంత్ - మణిరత్నం కాంబినేషన్ గురించి చెప్పుకోవాలంటే, వీరిద్దరూ గతంలో 1991లో వచ్చిన తలపతి చిత్రంలో కలిసి పనిచేశారు. ఈ చిత్రం తమిళ సినీ హిస్టరీలో ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ లెజెండరీ కాంబినేషన్ మళ్లీ ఒక భారీ ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతుండటం విశేషం.

మణిరత్నం దర్శకత్వంలో రజినీకాంత్ సినిమా అంటే, అభిమానుల్లో అంచనాలు మరో లెవెల్‌కి వెళ్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మణిరత్నం కథలూ, రజినీ స్టైల్ యాక్షన్ ఎలిమెంట్లు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహ్మాన్ స్వరాలు సమకూర్చనున్నారు. ఇది కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. రజినీకాంత్ - మణిరత్నం కాంబినేషన్‌తో పాటు ఏఆర్ రహ్మాన్ సంగీతం సినిమాకు ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు రజినీకాంత్ పుట్టినరోజు నాడు అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. ఈ లెజెండ్స్ చాలా కాలం తర్వాత కలవడంతో కేవలం తమిళ సినీ ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా, పాన్-ఇండియా స్థాయిలో కూడా సినిమాపై ఆసక్తిని పెంచే అంశం అవుతుంది. ఇది రజినీ కెరీర్‌లో మరో గొప్ప ప్రాజెక్ట్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.