ఈ లెక్క తేలింది? లెక్క సంగతేంటి సార్!
ఈ నేపథ్యంలో 'వెట్టేయాన్' కి ఎవరెవరు ఎంత ఛార్జ్ చేసారు? అన్న ప్రచారం సైతం జరుగుతోంది.
By: Tupaki Desk | 5 Oct 2024 10:30 PM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ 'వెట్టేయాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉన్నారు. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 'జైలర్' తర్వాత రజనీ నుంచి రిలీజ్ అవుతోన్న మరో సినిమా ఇది. దీంతో రజనీకాంత్ కొత్త సినిమాకి పారితోషికం ఎంత తీసుకున్నారు? అన్నది చర్చగా మారింది. ఈ నేపథ్యంలో 'వెట్టేయాన్' కి ఎవరెవరు ఎంత ఛార్జ్ చేసారు? అన్న ప్రచారం సైతం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో వారి పారితోషికాల సంగతి ఓసారి చూస్తే...బిగ్ బీ అమితాచ్చన్ కి 9 కోట్లు ఇచ్చారుట. పహాద్ పాజిల్ పారితోషికం 4 కోట్లు అట. అలాగే రజనీకి వైఫ్ పాత్ర పోషించిన సీనియర్ నటి మంజు వారియర్ కి 90 లక్షలు చెల్లించారుట. రితికా సింగ్ కి 30 లక్షలు ముట్టిందిట. మరి రజనీ లెక్క ఎంత అంటే దిమ్మతిరిగే లెక్కే కనిపిస్తుంది. మొత్తంగా రజనీకాంత్ 125 కోట్ల వరకూ తీసుకున్నట్లు సమాచారం.
లైకా ప్రొడక్షన్ సంస్థ గత పారితోషికం కన్నా 25 కోట్లు పెంచి మొత్తంగా 125 కోట్లు చెల్లించిందిట. `జైలర్` సినిమాకి రజనీ 100 కోట్లు తీసుకున్నారు. రిలీజ్ అనంతరం మంచి లాభాలు తేవడంతో ఆ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ లాభాలో కొంత వాటా కూడా ఇచ్చింది. అయితే లైకా ఆ ఛాన్స్ తీసుకోకుండా రిలీజ్ కి ముందే 125 కోట్లుగా చెల్లించినట్లు తెలుస్తోంది. ఇప్పటికీదే రజనీకాంత్ హాయ్యస్ట్ రెమ్యునరేషన్ గా చెప్పొచ్చు.
సినిమా సినిమాకి రజనీ పారితోషికం అంతకంతకు పెరుగుతుంది. ఆయన డిమాండ్ చేయకుండానే నిర్మాణ సంస్థలు స్వచ్ఛందంగా పెంచేస్తున్నాయి. మరి రజనీ సెట్స్ లో ఉన్న సినిమాకి ఎంత తీసుకుంటున్నారో తెలియాల్సిన లెక్క? ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.