రజినీ 'వేట్టయన్'.. తెలుగులో ఎందుకిలా?
కోలీవుడ్ హీరోల్లో అనేక మంది యాక్ట్ చేసిన సినిమాలు.. తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 26 Sep 2024 1:30 PM GMTకోలీవుడ్ హీరోల్లో అనేక మంది యాక్ట్ చేసిన సినిమాలు.. తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా ఇలా జరుగుతున్నా.. పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ అయ్యాక మరింత ఎక్కువైంది. అలా ఎన్నో తమిళ సినిమాలు.. తెలుగులో డబ్ అయ్యాయి.. అవుతున్నాయి కూడా.. ఆ సమయంలో డబ్బింగ్ వెర్షన్స్ కు తెలుగు ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా మేకర్స్ టైటిల్స్ పెట్టేవారు. గజినీ, బాషా వంటివి తప్పితే దాదాపు అన్ని కోలీవుడ్ డబ్డ్ వెర్షన్లకు టైటిల్స్ మార్చారనే చెప్పాలి.
ప్రముఖ దర్శకుడు శంకర్ అన్నియన్, నన్బన్ వంటి చిత్రాలను తెలుగులో అపరిచితుడు, స్నేహితుడు టైటిల్స్ తో విడుదల చేశారు. ఆయన ఒక్కరే కాదు.. దాదాపు అందరూ అదే ఫాలో అయ్యేవారు. కానీ కొంత కాలంగా.. కోలీవుడ్ నిర్మాతలు తమిళ టైటిల్ తోనే తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. స్టార్ హీరో అజిత్ వలిమై.. అదే టైటిల్ తోనే టాలీవుడ్ లో రిలీజ్ అయింది. అప్పటి నుంచి పలువురు మేకర్స్.. అనేక చిత్రాలను తమిళ పేర్లతోనే విడుదల చేశారు.. ఇప్పుడు కూడా చేస్తున్నారు.
స్టార్ హీరో సూర్య కంగువ మూవీ.. ఒకే టైటిల్ తో విడుదల కానుంది. ఇప్పుడు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వేట్టయన్ మూవీ కూడా ఆ జాబితాలోకి చేరిపోయింది. వేట్టయన్ అంటే తెలుగులో వేటగాడు అని అర్థం. దీంతో వేటగాడు టైటిల్ తో టాలీవుడ్ వెర్షన్ రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ మేకర్స్ మాత్రం వేట్టయన్ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇంతకుముందు రజినీ యాక్ట్ చేసిన పలు సినిమాల పేర్లను.. తెలుగు ఆడియన్స్ తగ్గట్టు మార్చారు మేకర్స్.
ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టైటిల్ ఛేంజ్ చేయకపోవడం కాస్త నిరాశ చెందిన విషయమని టాలీవుడ్ కు చెందిన రజినీ ఫ్యాన్స్ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు తెలుగు ఆడియన్స్ అంటే రెస్పెక్ట్ లేదా అని అడుగుతున్నారు. ఇంకొందరు.. భాషను గౌరవించాలనే బేసిక్ రూల్ ను కోలీవుడ్ మేకర్స్ ఫాలో అవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.
ఏదేమైనా.. స్థానిక భాషకు సరిపోయేలా టైటిల్ ను మార్చకపోతే సినిమాకు కాస్త లాస్ వచ్చే అవకాశం ఉంది. ఆడియన్స్ కు అంతగా కనెక్ట్ అవ్వదు. రిలేటెడ్ గా ఉన్నట్టు అనిపించదు. దానికి తోడు వేట్టయన్ మేకర్స్.. తమిళంలో తప్ప మిగతా భాషల్లో పెద్దగా ప్రమోట్ చేయలేదు. కోలీవుడ్ లో ఇప్పటికే ఈవెంట్ ను నిర్వహించిన మేకర్స్.. తెలుగులో ఒక్క ప్రమోషనల్ కార్యక్రమం కూడా జరపలేదు. మరి అక్టోబర్ 11వ తేదీన రిలీజ్ కానున్న సినిమా తెలుగులో ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.