Begin typing your search above and press return to search.

తలైవా.. ఈ ప్రయోగం క్లిక్కయ్యేనా?

అయితే వేట్టయాన్ కోసం జ్ఞానవేల్ చెప్పిన కథలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందని రజనీకాంత్ పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   9 Oct 2024 8:30 PM GMT
తలైవా.. ఈ ప్రయోగం క్లిక్కయ్యేనా?
X

సూపర్ స్టార్ రజనీకాంత్ చేసే ప్రతి సినిమా ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన అంచనాలు పెంచుతుందనే విషయం అందరికీ తెలిసిందే. రజినీ స్టైల్, మాస్ ఎలిమెంట్స్‌ను చూసే ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరి అలాంటి మాస్ హీరోతో జై భీమ్ డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ కలసి వర్క్ చేయబోతున్నారనేది వినగానే అందరిలో ఆశ్చర్యం కలిగింది.

జై భీమ్ లాంటి సామాజిక అంశాలతో కూడిన సినిమాను తెరకెక్కించిన జ్ఞానవేల్ శైలికి రజినీ మాస్ ఇమేజ్ సరిపోతుందా అనే సందేహం ప్రేక్షకుల్లో మొదలైంది. గతంలో రజనీకాంత్ చేసిన కబాలి, కాలా లాంటి సినిమాలు రజినీ సొంతమైన మాస్ ఎలిమెంట్లకు దూరంగా ఉండటంతో ఫ్యాన్స్‌ను నిరాశపరిచాయి. అదే పరిస్థితి మళ్ళీ వేట్టయాన్ సినిమాతో తలెత్తుతుందా అనేది అందరి ప్రశ్న.

ఈ నేపథ్యంలో రజినీకాంత్ వేట్టయాన్ ఆడియో లాంచ్‌లో ఈ అనుమానాలకు సమాధానమిచ్చారు. జై భీమ్ సినిమా తనకు ఎంతో నచ్చిందని, అయితే వేట్టయాన్ కోసం జ్ఞానవేల్ చెప్పిన కథలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందని రజనీకాంత్ పేర్కొన్నారు. కథ వినడం తర్వాత, కథ చాలా బాగా ఉన్నప్పటికీ, రజనీకాంత్ తాను చెప్పినవి కమర్షియల్ ఎలిమెంట్స్ అవసరం అనిపించిందని చెప్పారు.

జ్ఞానవేల్ మొదట ఈ విషయానికి ససేమిరా అన్నారు. అయితే, రజినీ విజ్ఞప్తి మేరకు పది రోజుల తరువాత కొన్ని మార్పులతో కథను తీసుకొచ్చారు. రజనీకాంత్ ఈ మార్పులను చూసి ఆశ్చర్యపోయారు. కమర్షియల్ ఎలిమెంట్లు ఉన్నప్పటికీ, జ్ఞానవేల్ తన శైలికి తగ్గట్టుగా కథను అద్భుతంగా మలిచారని రజనీకాంత్ చెప్పారు.

జ్ఞానవేల్ తన సినిమాల్లో సామాజిక అంశాలను చాలా ఇంటెన్స్‌గా, సీరియస్‌గా చూపిస్తారు. కానీ వేట్టయాన్ సినిమాకి మరొక ఎలిమెంట్ జోడించడమే ఈ చిత్రాన్ని ప్రత్యేకం చేయబోతుందని అనిపిస్తుందట. రజినీ అభిమానుల కోసం కొన్ని మాస్ ఎపిసోడ్లు ఉంటాయని మేకర్స్ తెలిపారు. అలాగే జ్ఞానవేల్ శైలిలో కథనాన్ని నడిపించడం ద్వారా వేట్టయాన్ యూనివర్సల్ అప్పీల్ కలిగిన చిత్రంగా రూపుదిద్దుకుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ చిత్రానికి మరో ముఖ్యమైన ఆకర్షణగా నిలవనుంది. ట్రైలర్ ను బట్టి టీజీ జ్ఞానవేల్ కమర్షియల్ ఎలిమెంట్లతో కూడిన ఒక బలమైన సామాజిక కథనాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నారని తెలుస్తోంది. రజినీ కెరీర్‌లో, విభిన్నమైన కథలతో వచ్చిన సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. మరి ఈ సారి రజినీ చేసిన ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.