సూపర్ స్టార్ ని మళ్లీ అక్కడ రీ-లాంచ్ చేస్తారా?
రజనీకాంత్ హిందీలో సినిమాలు చేసి రెండు దశాబ్ధాలు దాటింది. చివరిగా 'బులాంది' సినిమా తర్వాత షారుక్ ఖాన్ హీరోగా నటించిన 'రావన్' లో గెస్ట్ రోల్ పోషించారు.
By: Tupaki Desk | 27 Feb 2024 11:30 PM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ మళ్లీ బాలీవుడ్ లో కంబ్యాక్ కి రెడీ అవుతున్నారా? సూపర్ స్టార్ రీలాంచ్ భారీ స్పాన్ ఉన్న స్టోరీ రెడీ అవుతోందా? అంటే అవుననే తెలుస్తోంది. రజనీకాంత్ హిందీలో సినిమాలు చేసి రెండు దశాబ్ధాలు దాటింది. చివరిగా 'బులాంది' సినిమా తర్వాత షారుక్ ఖాన్ హీరోగా నటించిన 'రావన్' లో గెస్ట్ రోల్ పోషించారు. ఆ తర్వాత రజనీకాంత్ మళ్లీ హిందీ సినిమాల్లో నటించింది లేదు.
కోలీవుడ్ లోనే సినిమాలు చేసారు తప్ప ఇతర భాషలవైపు చూసింది లేదు. 1983 లో తొలిసారి హిందీలో 'అందా కనూన్' సినిమాలో నటించారు. ఆ తర్వాత బాలీవుడ్ లో స్టార్ హీరోలతో కలిసి చాలా సినిమాలు చేసారు. కానీ పూర్తి స్థాయిలో హిందీ మార్కెట్ పై దృష్టి పెట్టింది అయితే లేదు. కోలీవుడ్ లో చేసిన సినిమాలు ఇండియా వైడ్ రిలీజ్ అవ్వడం తప్ప! ప్రత్యేకించి మళ్లీ అప్పటి నుంచి హిందీలో సినిమాలు చేయలేదు.
అయితే మళ్లీ సూపర్ స్టార్ ని బాలీవుడ్ లో సాజిద్ నడియావాలా రీలాంచ్ చేసేలా సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. రజనీతో ఓభారీ బడ్జెట్ సినిమా నిర్మించడానికి సాజిద్ సీరియస్ గా ఉన్నాడని మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రజనీకాంత్ తో కూడా ఈ విషయంపై ఆయన చర్చించి నట్లు.. రజనీ కూడా సానుకూలంగానే స్పందించినట్లు ప్రచారం సాగుతోంది. అయితే దర్శకుడు పేరు మాత్రం ఇంకా వెలుగులోకి రాలేదు. ఇంకా రజనీకాంత్ ని ఒప్పించే ప్రోసస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే రజనీకాంత్ కోలీవుడ్ లో పూర్తి చేయాల్సిన సినిమాలు కొన్ని ఉన్నాయి. ప్రస్తుతం టి.జె జ్క్షాన్ వేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే లొకష్ కనగరాజ్ తో 171వ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్తారు. దీని తర్వాత 'జైలర్' దర్శకుడు నెల్సన్ దిలీప్ తో ఆ సినిమా సీక్వెల్ కూడా పూర్తి చేయా లి. అలాగే 'ఖాకీ' దర్శకుడు హెచ్. వినోధ్ తోనూ రజనీకాంత్ ఓ సినిమా కమిట్ అయ్యారు.
ఇంకా పా రంజిత్ కూడా క్యూ లో ఉన్నాడు. వీళ్లంతా రజనీ కాంత్ తో చాలా కాలంగా ట్రావెల్ అవుతున్నారు. అయితే బాలీవుడ్ కథనాల ప్రకారం సాజిద్ వచ్చే ఏడాది రజనీతో సినిమా ప్రారంభించాలి అనే ఆలోచనలో ఉన్నట్లు వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుంది? అన్నది చూడాలి.