తలైవా.. చిరు జోరును తట్టుకోగలరా?
కానీ ఈ సారి మాత్రం తలపడబోతున్నారు. చిరు భోళాశంకర్ తో(ఆగస్ట్ 11) రానుండగా.. రజనీకాంత్ జైలర్ గా(ఆగస్ట్ 10) రానున్నారు.
By: Tupaki Desk | 5 Aug 2023 6:35 AM GMTమెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్.. ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ కెరీర్ లో పుల్ బిజీగా ఉంటున్నారు. అయితే ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా తలపడిన సందర్భాలు లేవు. కానీ ఈ సారి మాత్రం తలపడబోతున్నారు. చిరు భోళాశంకర్ తో(ఆగస్ట్ 11) రానుండగా.. రజనీకాంత్ జైలర్ గా(ఆగస్ట్ 10) రానున్నారు. ఈ రెండు చిత్రాలు ఒక్క రోజు గ్యాప్ లో రానున్నాయి. దీంతో బాక్సాఫీస్ వార్ మెగా స్టార్ వర్సెస్ సూపర్ స్టార్ గా కొంతమంది సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. మరి కొందరు చిరు ఉన్న ఫామ్ కు రజనీ పోటీయే కాదని అంటున్నారు.
అయితే విషయానికొస్తే.. 'ఖైదీ నెంబర్ 150' చిత్రం తర్వాత తమ ఇమేజ్ కు తగ్గట్టు సరైన విజయాన్ని అందుకోలేకపోయిన చిరు.. ఈ ఏడాది 'వాల్తేరు వీరయ్య'తో ఆ సక్సెస్ ను చూశారు. చిరు సెకండ్ ఇన్నింగ్స్ కెరీర్ కు ఇదో మలుపు అనే చెప్పాలి. అసలు చిరు మూవీస్ ను ఈ జనరేషన్ ఆడియెన్స్ రిసీవ్ చేస్తారా లేదా.. మళ్లీ చిరు రికార్డులు సృష్టించే సత్తా ఉందా లేదా అన్న అనుమానాలు వచ్చిన నేపథ్యంలో.. వాల్తేరు వీరయ్య దానికి సమాధానం ఇచ్చింది. రొటీన్ కంటెంట్ తోనే వచ్చినా చిరు మాస్ ఇమేజ్ కు తగ్గట్టు ఉండడంతో భారీ వసూళ్లను అందుకుంది.
'వాల్తేరు వీరయ్య' కన్నా ముందుకు వచ్చిన 'గాడ్ ఫాదర్' కూడా మంచి హిట్ నే అందుకుంది. అలా చిరు మంచి ఫామ్ లోకి వచ్చేశారు. దీంతో 'భోళాశంకర్'పై అభిమానులు, సినీ ప్రియులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కట్ కూడా ఫ్యాన్స్ కు బాగానే ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూసేద్దామా అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
అయితే ఈ 'భోళాశంకర్' రిలీజ్ కు ఒకరోజు ముందే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' కూడా ఇక్కడ విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన యాక్షన్ ట్రైలర్ కూడా బాగానే ఆకట్టుకుంది. పాన్ ఇండియా స్థాయి లో ఇది ఆడియెన్స్ ముందుకు రానుంది. సాధారణంగా రజనీ సినిమా అంటే ఏ ఇండస్ట్రీ అభిమానుల్లో అయినా భారీ క్రేజ్ ఉంటుంది. కానీ ఈ మధ్య ఆయన వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్నారు.
వరుసగా సినిమాల్లో నటించినప్పటికీ ఆయన స్టార్ డమ్ కు తగ్గ హిట్ ఏమీ రాలేదు. 'రోబో 2.0', 'పేట', 'దర్బార్', 'అన్నాత్తె' ఇవన్నీ కమర్షియల్ హిట్ అందుకున్నప్పటికీ కంటెంట్ పరంగా భారీ స్థాయి లో ఆడియెన్స్ ను మెప్పించలేకపోయాయి. అయితే ఈ సారి 'జైలర్'తో ఎలాగైన రజనీ తన స్టార్ డమ్ కు తగ్గ హిట్ ను అందుకుంటారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
అయితే ఎంత కాదనుకున్నా టాలీవుడ్ విషయానికొస్తే మొదటగా సినీ ప్రియులు చిరు సినిమాకే ప్రాధాన్యత ఇస్తారు. అసలే రజనీ వరుస ఫ్లాప్ లతో ఫామ్ లో లేరు. కాబట్టి 'జైలర్' కంటెంట్ బాగుందని మౌత్ టాక్ వస్తేనే వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి చిరు 'భోళాశంకర్'కు రజనీ 'జైలర్' పోటీయే కాదని అంటున్నారు ఇంకొంతమంది సినీ ప్రియులు. చూడాలి మరి ఈ రెండు చిత్రాలు అభిమానులను ఎంత మేరకు ఆకట్టుకుంటాయో అని.