'జైలర్' సాహసోపేత యాత్రలు
అందులో భాగంగా తాజాగా ఉత్తరాఖండ్ లోని ద్వారహత్ పర్వత శ్రేణిలో ఉన్న బాబా గుహ ను సందర్శించారు.
By: Tupaki Desk | 16 Aug 2023 7:37 AM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడ. రజినీకాంత్ ఫ్యాన్స్ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను.. అడ్వెంచర్ సన్నివేశాలను ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం రజినీకాంత్ రియల్ అడ్వెంచర్ లు చేస్తున్నాడు.
జైలర్ సినిమా విడుదలకు ముందే రజినీకాంత్ హిమాలయ పర్యటకు వెళ్లిన విషయం తెల్సిందే. అందులో భాగంగా తాజాగా ఉత్తరాఖండ్ లోని ద్వారహత్ పర్వత శ్రేణిలో ఉన్న బాబా గుహ ను సందర్శించారు. అందుకోసం రెండు గంటల అసాదారణ యాత్ర ను రజినీకాంత్ కొనసాగించాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
మహావతార్ బాబాజీ గుహలో రజనీకాంత్ కొంత సమయం ధ్యానం చేయడం జరిగింది. సాధారణంగా రజినీకాంత్ స్థాయి వయసు వారు ఆ గుహ వద్దకు వెళ్లేందుకు డోలెలను ఆశ్రయిస్తారు. కాని ఆయన మాత్రం నడుచుకుంటూ వెళ్లారని తెలుస్తోంది. ఆయన ఈ వయసులో కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు.
సెలబ్రెటీలు ఈ వయసు లో విదేశాల్లో హాయిగా చక్కర్లు కొడుతూ ఉంటే రజినీకాంత్ మాత్రం హిమాలయాలకు ప్రశాంతత కోసం వెళ్లడం విడ్డూరంగా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా పలు సార్లు రజినీకాంత్ హిమాలయ యాత్రలకు వెళ్లిన విషయం తెల్సిందే.
ఇక జైలర్ విషయానికి వస్తే భారీ ఎత్తున వసూళ్లు నమోదు చేస్తోంది. ఈ మధ్య కాలంలో రజినీకాంత్ చేసిన ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఈ రేంజ్ లో సక్సెస్ లను అందుకోలేక పోయింది. రోబో సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాన్ని జైలర్ సినిమా తో రజినీకాంత్ దక్కించుకున్నాడు అంటూ అభిమానులు దర్శకుడు నెల్సన్ దిలీప్ కి కృతజ్ఞతలు చెబుతున్నారు.