Begin typing your search above and press return to search.

యంగ్‌ హీరోలు కూడా రజనీలా చేయలేరేమో..!

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ 74 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ సర్‌ప్రైజ్ చేస్తున్నారు. అవి కూడా చిన్నా చితకా సినిమాలు కాకుండా భారీ యాక్షన్‌ సీన్స్ ఉన్న సినిమాలు, భారీ బడ్జెట్‌ సినిమాలు కావడం విశేషం.

By:  Tupaki Desk   |   21 March 2025 11:20 AM IST
యంగ్‌ హీరోలు కూడా రజనీలా చేయలేరేమో..!
X

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ 74 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ సర్‌ప్రైజ్ చేస్తున్నారు. అవి కూడా చిన్నా చితకా సినిమాలు కాకుండా భారీ యాక్షన్‌ సీన్స్ ఉన్న సినిమాలు, భారీ బడ్జెట్‌ సినిమాలు కావడం విశేషం. ఒకప్పుడు కోలీవుడ్‌లో ఏడాదిలో అత్యధిక సినిమాలను విడుదల చేసిన హీరోగా నిలిచిన రజనీకాంత్ ఆ తర్వాత కాలంలో అందరు హీరోల మాదిరిగానే స్లో అయ్యారు. సినిమా మేకింగ్‌లో వచ్చిన మార్పులు, పెరిగిన బడ్జెట్‌, ఇతర కారణాల వల్ల ఒకే సమయంలో ఎక్కువ సినిమాలు చేసే పరిస్థితి లేదు. ఒక సినిమా తర్వాత ఒకటి అన్నట్లు రజనీకాంత్‌ సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు స్పీడ్‌ పెంచాడు. బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రజనీకాంత్‌ మినిమం బ్రేక్‌ తీసుకోకుండా సినిమాలు చేస్తున్నారు.


లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా 'కూలీ' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసినట్లు లోకేష్ కనగరాజ్ అధికారికంగా ప్రకటించాడు. రజనీకాంత్‌ చివరి వర్కింగ్‌ డే ఫోటోలను దర్శకుడు లోకేష్ ఎక్స్ ద్వారా షేర్‌ చేశాడు. రజనీకాంత్‌ సర్‌తో సినిమాను చేయడం అద్భుతమైన జర్నీ అంటూ చెప్పుకొచ్చాడు. సినిమా కోసం వర్క్‌ చేసిన ప్రతి ఒక్కరికి ఎక్స్ ద్వారా లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశాడు. త్వరలోనే కూలీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కూలీ సినిమా షూటింగ్‌ పూర్తి అయిందో లేదో అప్పుడే తదుపరి సినిమా షూటింగ్‌లో రజనీకాంత్‌ జాయిన్‌ అయ్యారు. గత కొన్ని రోజులుగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న జైలర్‌ 2 సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయింది.

కూలీ షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత కనీసం రెండు రోజులు కూడా రజనీకాంత్‌ బ్రేక్‌ తీసుకోకుండా వెంటనే జైలర్‌ 2 సినిమా షూటింగ్‌కు హాజరు అవుతున్నారు. చాలా మంది సీనియర్ హీరోలు ఒక షెడ్యూల్‌కి మరో షెడ్యూల్‌కి మధ్య కనీసం నెల రోజుల గ్యాప్‌ తీసుకుంటున్నారు. అలాంటిది రజనీకాంత్‌ ఒక సినిమా పూర్తి చేసి కనీసం వారం రోజులు కూడా రెస్ట్‌ తీసుకోకుండా జైలర్‌ 2 సినిమా షూటింగ్‌లో జాయిన్‌ కావడం ఆశ్చర్యంగా ఉంది అంటూ నెటిజన్స్ ముఖ్యంగా ఆయన అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. రజనీకాంత్‌ వయసు 74 అయినా పాతికేళ్ల కుర్రాడి మాదిరిగానే ఆయన ఉత్సాహంగా సినిమాల్లో నటిస్తున్నారు. అంతే కాకుండా ఆయన సినిమాల ఎంపిక విషయంలో యంగ్‌ హీరోలకు పోటీని ఇస్తున్నారు.

జైలర్‌ సినిమా సూపర్ హిట్‌ కావడంతో దర్శకుడు నెల్సన్ దిలీప్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ మరో సినిమా చేయాలని భావించారు. అది జైలర్‌ 2 గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జైలర్‌ 2 సినిమాను కేవలం ఆరు నెలల్లోనే ముగించాలని దర్శకుడు నెల్సన్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే కూలీ నుంచి బయటకు వచ్చిన వెంటనే రజనీకాంత్‌తో నెల్సన్‌ షూటింగ్‌ మొదలు పెట్టారు. రజనీకాంత్ ఏమాత్రం అలసట లేకుండా జైలర్ 2 షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఎంతో మంది యంగ్‌ హీరోలు ఏడాదిలో కనీసం ఒక్క సినిమాను విడుదల చేయలేక పోతున్నారు. వారందరూ కచ్చితంగా 74 ఏళ్ల కుర్రాడిగా సినిమాలు చేస్తున్న రజనీకాంత్‌ను చూసి నేర్చుకోవాల్సిందే. ఎంత ప్రయత్నించినా యంగ్‌ హీరోలు రజనీకాంత్‌ మాదిరిగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయలేరేమో. ఈ ఏడాదిలో రజనీకాంత్‌ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది కోసం కూడా సినిమాలు లైన్‌లో ఉన్నాయి.